»   » నా పేరులో "రాజ్‌పుత్" తీసేస్తున్నా...! ఎమ్మెస్ ధోనీ హీరో సంచలన ప్రకటన ప్రకటన

నా పేరులో "రాజ్‌పుత్" తీసేస్తున్నా...! ఎమ్మెస్ ధోనీ హీరో సంచలన ప్రకటన ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

టీం ఇండియాకు క్రికెటర్, వికెట్ కీప‌ర్, కెప్టెన్ కూల్ గా పేరొందిన ఎంఎస్ ధోనీ, ఇండియాకు ఎన్నో విజ‌యాల‌ను అందించ‌డంతో పాటూ, 28ఏళ్ల ప్ర‌పంచ క‌ప్ క‌ల‌ను కూడా సాకారం చేసిన రియ‌ల్ లైఫ్ హీరో. ధోనీ జీవిత కథ ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కిన చిత్రం "ఎమ్మెస్ ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీ". ఎంఎస్ ధోనీ పాత్ర‌లో అద్భుతంగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఎంఎస్ ధోనీ సినిమా కూడా బాలీవుడ్ లో స‌క్సెస్‌ సాధించి కలెక్షన్ల‌ వర్షం కురిపించింది. ఈ సినిమాతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు.

ఈ యంగ్ హీరో ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ తాజాగా జైపూర్ లో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి పై జరిగిన దాడిని ఖండించాడు. అసలు మనం ఎక్కడున్నాం?? మానవత్వం కంటే గొప్ప కులం గానీ మతం గానీ ఈ ప్రపంచం లోనె లేదు" అంటూ ఒక ట్వీట్ పెట్టిన సుశాంత్. నెమ్మదిగా ఆ దాడి ఘటనకు కారణమైన ప్రతీ విషయాన్నీ ఖండిస్తూ పోయాడు.

sushant singh rajput

సంజయ్ తీస్తున్న కొత్త సినిమా "పద్మావతి" సినిమాలో రాజ్‌పుత్ రాణిగా దీపికా పదుకొణే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీకి రాణి పద్మావతికి మధ్య ప్రేమాయణం జరిగినట్లు దృశ్యాలు చిత్రీకరిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తీసిన దృశ్యాలను తొలగించి భన్సాలీ జాతికి క్షమాపణలు చెప్పాలని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్ మీదకి వెళ్ళి నానా భీబత్సం సృష్టించిన సంగతి తెల్సిందే...

ఈ విషయం పై బాలీవుడ్ ప్రముకులందరూ స్పందిస్తున్న నేపథ్యం లో స్వయానా రాజ్ పూత్ వంశానికి చెందిన సుశాంత్ ఇలా ట్వీట్ చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. "మన ఇంటిపేరుతో వచ్చే గుర్తింపు కోసం మనం పాకులాడుతున్నాం.. ఎందుకని మనం మన సొంత పేరుతో మాత్రమే గుర్తిపంపు తెచ్చుకోలేం..? అని అర్థం వచ్చేలా ట్వీట్ ని పెట్టిన ఈ యువహీరో... తన పేరు వెనుక కులాన్ని సూచించే "రాజ్‌పుత్" ని తీసేస్తున్నట్టు గా ప్రకటించాడు.

పద్మావతి సెట్స్ పై దాడి చేసి న కర్ణి సేనా కార్యకర్తలు తనమీద కూడా దాడి చేయటం తో భద్రతా కారణాల దృష్ట్యా జైపూర్ లో షూటింగ్ నిర్వహించ బోవటం లేదనీ, అక్కడినుంచి వచ్చేసి ఆ తర్వాత షూట్ ఎక్కడ జరపాలో నిర్ణయిస్తామనీ... ఈ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తెలిపాడు.

English summary
"We would suffer till the time we're obsessed with our surnames. If you're that courageous, give us your first name to acknowledge," tweeted Sushant Singh Rajput
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu