»   » ధోనీలా.. హెలికాప్టర్ షాట్ కొడుతూ గాయపడ్డ హీరో

ధోనీలా.. హెలికాప్టర్ షాట్ కొడుతూ గాయపడ్డ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రికెట్ మైదానంలో హెలికాప్టర్ షూట్ అనగానే మనకు గుర్తుకొచ్చే క్రికెటర్ ఎంఎస్ ధోని. టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనేది టైటిల్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు.

ధోని మాధిరిగా హెలికాప్టర్ షాట్ ఆడటం ప్రాక్టీస్ చేస్తున్న సుశాంత్ సింగ్....గాయపడ్డాడు. బాల్ పక్కటెముకలకు తాకిగాయమైనట్లు తెలుస్తోంది. సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించి కనిపించనున్నాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.

Sushant Singh Rajput injured

జులై నుండి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేది ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ హీరోయిన్ అలీయా భట్, శ్రద్ధా దాస్, దోయేయ్ హీరోయిన్ క్రితి సనన్ పరేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Sushant Singh Rajput injured

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు సినీ ప్రియులతో పాటు, అటు క్రికెట్ అభిమానులు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
Sushant Singh Rajput has put in months of training to perfect every minute detail of his portrayal of Indian cricket captain Mahendra Singh Dhoni in the upcoming biopic ‘M S Dhoni-The Untold Story’.
Please Wait while comments are loading...