»   » మగధీర కాపీ సినిమా రిలీజ్ , ఎలాగైనా సరే కాస్త తీరిక చేసుకుని మూవీ చూడండి: హీరో ట్వీట్

మగధీర కాపీ సినిమా రిలీజ్ , ఎలాగైనా సరే కాస్త తీరిక చేసుకుని మూవీ చూడండి: హీరో ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం 'రాబ్తా'. ఈ చిత్రం ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ రిలీజవ్వగానే ''తెలుగులో అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిన 'మగధీర' చిత్రానికి, దీనికి చాలా కనెక్షన్‌ ఉన్నట్టుంది!'' అని సోషల్‌ మీడియాలో సినీగోయెర్స్ బాగానే సెటైర్స్‌ వేశారు. 'రాబ్తా' ట్రైలర్‌లో, స్టిల్స్‌లో 'మగధీర' ఛాయలు కనిపిస్తున్నాయని అంతా అనుకున్నారు.

మక్కికి మక్కి కాపీ

మక్కికి మక్కి కాపీ

మొత్తం సినిమానే మక్కికి మక్కి కాపీ చేసి కథను హైజాక్ చేశారని మగధీర నిర్మాత అంటున్నారు. ‘‘రాబ్తా అంటే కనెక్షన్‌. కానీ మగదీరతో కనెక్షన్ పెట్టుకున్నారని అనుకున్నాం కానీ ఏకంగా మా చిత్రకథను కాపీ కొట్టారు'' అంటూ ‘మగధీర' చిత్రనిర్మాత అల్లు అరవింద్‌ హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు మెట్లెక్కారు. కానీ ఎట్టకేలకు సినిమా మాత్రం విడుదలకు సిద్దమయ్యింది.


కాపీ అనడం భావ్యం కాదు

కాపీ అనడం భావ్యం కాదు

అయితే కేవలం ట్రైలర్ చూసి కాపీ అనడం భావ్యం కాదని మూవీ యూనిట్ వివరణ ఇచ్చుకుంది. రేపు (శుక్రవారం) విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో 'రాబ్తా' హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. 'నా మూవీ రాబ్తా రేపు విడుదల కానుంది. ఎలాగైనా సరే కాస్త తీరిక చేసుకుని మూవీ చూడండి. మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోగలరని' సుశాంత్ ట్వీట్ చేశాడు.


ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు

ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' తో సక్సెస్ బాట పట్టాడు సుశాంత్. ఓ మంచి సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో రాబ్తాపై ఈ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం ఎంతగానో కసరత్తులు చేయడం తెలిసిందే. హిట్ కోసం ఎదురుచూస్తున్న కృతి సనన్‌కు రాబ్తా సక్సెస్ కీలకం కానుంది.


జూన్ 9న

జూన్ 9న

మరోవైపు టాలీవుడ్ మూవీ మగధీరను కాపీ కొట్టారంటూ వివాదం రాజుకోవడంతో రాబ్తాకు ప్రచారం కూడా ఎక్కువగానే జరిగింది. దీంతో 'రీల్' ధోనీని ప్రేక్షక్షులు ఆధరిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. సుశాంత్‌, ‘వన్‌ నేనొక్కడినే' ఫేమ్ కృతి సనన్‌ జంటగా నటించిన ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.English summary
"Please find some time and love for #raabta tomorrow and let me know how the experience was.Much love❤️" Tweeted hero Sushsnth Singh Rajput.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu