»   » ఎలాగైనా హిట్ సినిమా తియ్యాలనే....: సుశాంత్

ఎలాగైనా హిట్ సినిమా తియ్యాలనే....: సుశాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ఎలాగైనా హిట్ సినిమా తియ్యాలని తీసిన సినిమా. కమర్షియల్ సినిమాల్లో కొత్తదనం ఉన్న సినిమా. సొసైటీకి కనెక్టయ్యే పాయింట్‌తో కార్తీక్‌రెడ్డి చాలా బాగా సినిమా తీశాడు. నన్నూ, శాన్వినీ తాజా జంట అంటున్నారు. ఈ సినిమా సాధించిన ఫలితానికి సంతృప్తిగా ఉంది'' అన్నారు హీరో సుశాంత్. సుశాంత్ హీరోగా శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై ఎ. నాగసుశీలతో కలిసి చింతలపూడి శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జి. కార్తీక్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాల్లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.

చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ " సుశాంత్‌తో తాము నిర్మించిన మూడు సినిమాల్లో 'అడ్డా' పెద్ద హిట్టయ్యింది. క్లైమాక్స్‌లో సుశాంత్ నటన అద్భుతం అంటున్నారు. అన్ని రకాల ఛాయలున్న పాత్రలో బాగా రాణించాడు. కార్తీక్‌రెడ్డి కొత్తవాడైనా సీనియర్ డైరెక్టర్‌గా సినిమాని హ్యాండిల్ చేశాడు. అనూప్ రూబెన్స్ ట్యూన్స్, రీరికార్డింగ్‌తో 'రూబీ' అనిపించుకున్నాడు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందివ్వాలన్న మా కోరిక 'అడ్డా'తో నెరవేరింది'' అని చెప్పారు. దర్శకుడు కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ సుశాంత్ అంకితభావం తనలో స్ఫూర్తినింపిందని చెప్పారు.

సినిమా విడుదలకు ముందుగానే అనూప్ పాటలు హిట్టయ్యాయనీ, ఈ సినిమా సాధించిన విజయానికి నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) సంతోషంగా ఉన్నారనీ నాగసుశీల అన్నారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ"క్లిష్టమైన సబ్జెక్టును దర్శకుడు హ్యాండిల్ చేశాడు. క్లైమాక్స్‌లో సుశాంత్ నటన నా నేపథ్య సంగీతానికి స్ఫూర్తినిచ్చింది'' అని తెలిపారు. నటించడానికి అవకాశమున్న మంచి పాత్ర ఇచ్చారనీ, సుశాంత్‌తో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటున్నాననీ హీరోయిన్ శాన్వి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ గౌతంరాజు కూడా పాల్గొన్నారు.

English summary
Hero Sushanth Says that his Adda film is a hit. Sushanth, grandson of Akkineni Nageswara Rao and nephew of Nagarjuna, is back after four years with Adda directed by Sai Karthik, an associate of Puri Jagannadh. Adda like Sushanth’s previous two films is produced by his mother Naga Susheela and Chintalapudi Srinivasa Rao on Sri Nag Corporation banner. His last film Current released in 2009.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu