»   » అక్కినేని గెస్ట్‌‌గా ‘అడ్డా’ ఆడియో

అక్కినేని గెస్ట్‌‌గా ‘అడ్డా’ ఆడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కాళిదాసు, కరెంట్ చిత్రాల్లో నటించిన హీరో సుశాంత్ ప్రస్తుతం శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీకరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న 'అడ్డా'చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో వేడుక జూన్ 22న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'యాక్షన్ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న మా 'అడ్డా' చిత్రం ఆడియో ఆవిష్కరణ జూన్ 22న జరుగుతుంది. ఈ ఆడియో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అక్కినేని అభిమానులతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొంటారు. ఈ ఆడియో ఆవిష్కరణలో సుశాంత్, శాన్వి, శ్వేతా భరద్వాజ్ వేదికపై చేసే డాన్స్ హైలెట్ అవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జులై నెలలో 'అడ్డా' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

సుశాంత్, శాన్వి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్లవేణు, ధన్ రాజ్, స్విప్నిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : ఎస్.అరుణ్ కుమార్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.వి.ఎస్.వాసు, కోడైరెక్టర్ : డి. సాయికృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జి.కార్తీక్ రెడ్డి.

English summary
Sushanth's new film Adda audio to be releasing on June 22. Shanvi is playing Sushanth's romantic interest. Sai Reddy is the director. Naga Susheela and Chintalapudi Srinivas are produce this film which is being touted as a love and action entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu