»   » అద్బుతమైన క్లాసిక్ సినిమా లో పాట అది: రీమిక్స్ మంచి ఆలోచనేనా?

అద్బుతమైన క్లాసిక్ సినిమా లో పాట అది: రీమిక్స్ మంచి ఆలోచనేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పాత పాటలను ఎప్పుడు తట్టి లేపినా మధురమైన అనుభూతులను మదినిండా వెదజల్లుతూనే ఉంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో పాత పాటలను రీమిక్స్ చేయడం ఎక్కువవుతూ వస్తోంది. ఈమధ్య కాలం లో నటవారసులు అలనాతి హిట్ సాంగ్స్ కి మళ్ళీ మెరుగులు దిద్ది రీమిక్స్ చేయటం పరిపాటి అయిపోయింది.

చిరు గ్యాంగ్ లీడర్ లోని బంగారు కోడిపెట్టని రామ్ చరణ్ రీ మిక్స్ చేస్తే. మొన్నటికి మొన్న ధరం తేజ్ "యముడికి మొగుడు లోని.. అందం హిందోళం" అనే పాతని రీమిక్స్ చేసి మళ్ళీ తెరమీదికి తెచ్చాడు. అయితే ఇలాంటి ప్రయోగాలు ప్రతీసారీ సక్సెస్ అవ్వవు దసరా బుల్లోడు లోని "పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్ల..." అనే పాతని విక్రం హీరో గా వచ్చిన మల్లన్న లో వాడటం విమర్శలకు దారి తీసింది.

sushanth song

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రానికి సంబంధించి పాటలు మినహా టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది.

ఈ క్రమంలో 'ఆటాడుకుందాం .. రా' సినిమాలోను ఇదే రీమిక్స్ ఫార్ములా ని ఫాలో అయిపోయారు. ఈ చిత్రంకోసం నటసామ్రాట్‌ డా.అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' చిత్రంలోని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం ఛలో ఛలో' పాటని రీమిక్స్‌ చేశారు. ఇటీవల పోచంపల్లి, రామోజీ ఫిల్మ్‌ సిటీలో శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో నాలుగురోజులపాటు ఈ పాటను చిత్రీకరించారు.

అయితే తెలుగు సూపర్ క్లాసిక్స్ లో ఒకటైన దేవదాసు లోని పాటలు కూడా ఎవర్ గ్రీన్... మరి ఆ పాటని ఇప్పటి కుర్ర నటీ నటీనటుల స్టెప్పులతో రీమిక్స్ చేయటం ఎంతవరకూ ఆకట్టు కుంటుందనేది అనుమానమే...
యూనిట్ సభ్యులైతే పాత అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.

కానీ సినిమా వచ్చాక ప్రేక్షకు లు కూడా అదే ఫీలైతేనే సక్సెస్ అయినట్టు. మిగతా పాటలను విదేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా అయినా సుశాంత్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

English summary
Young hero Sushant working for new movie ‘Aatadukundam Raa’ is dancing to the re-mix tune of his legendary grandfather Late ANR’s ‘Pallekau Podam… Paarulu Chooddaam Chalo Chalo’ song from the evergreen movie ‘Devadas’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu