»   » స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సుశాంత్ ఖరారు

స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో సుశాంత్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'కాళిదాసు', 'కరెంట్‌', 'అడ్డా' వంటి చిత్రాలతో ముందుకెళ్తున్న నాగార్జున మేనల్లుడు సుశాంత్‌ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్‌ నృత్య దర్శకుడు విష్ణుదేవా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. శ్రీనాగ్‌ కార్పొరేషన్‌ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సినిమాని నిర్మిస్తారు.

సుశాంత్‌ మాట్లాడుతూ ''అడ్డా' సినిమా చిత్రీకరణ సమయంలో విష్ణు ఈ కథ చెప్పాడు. అందరికీ నచ్చింది. ప్రభుదేవా పర్యవేక్షణలో తయారైన కథ ఇది. సుశాంత్‌కి ఈ కథ చాలా బాగుంటుందని అందరికీ అనిపించిన తర్వాతే ఈ కథను ఓకే చేశాం. ప్రఖ్యాత నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య వద్ద శిష్యరికం చేసి, వాంటెడ్, రామ్‌లీలా, రాంబో రాజ్‌కుమార్ లాంటి భారీ చిత్రాలకు సోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు విష్ణుదేవా. తప్పకుండా దర్శకునిగా కూడా తను విజయం సాధిస్తాడని మా నమ్మకం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి స్వరాలందించే పనిలో ఉన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము'' అని తెలిపారు.

సుశాంత్ మాట్లాడుతూ...'స్విట్జర్లాండ్‌లో 'అడ్డా' పాటల చిత్రీకరణ టైమ్‌లో విష్ణుదేవా ఈ లైన్ చెప్పాడు. 'అడ్డా' విడుదలయ్యాక.. లైన్‌ను డెవలప్ చేసి మరింత డీటైల్డ్‌గా కథ చెప్పాడు. నేను ఎలాంటి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానో... సరిగ్గా అలాంటి కథనే విష్ణు చెప్పాడనిపించింది. ఆడియన్స్‌కూ, అక్కినేని ఫ్యాన్సుకూ నచ్చే సినిమా అవుతుంది'' అని సుశాంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పోరాటాలు: కనల్ కణ్ణన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తారు.

English summary
Sushanth is all set to team up with choreographer turned director, Vishnu Deva for his next film. Chintalapudi Srinivasa Rao and A Naga Susheela are going to produce this untitled film under Sri Nag Corporation banner. In the past, Vishnu Deva had choreographed some songs in Sushanth starrer Adda and that film did quite well at the box-office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu