»   » షారుక్ పక్కన ఆ పాత్రనా.. దర్శకుడి ఆఫర్‌కు హీరోయిన్ షాక్

షారుక్ పక్కన ఆ పాత్రనా.. దర్శకుడి ఆఫర్‌కు హీరోయిన్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు విలక్షణ నటి స్వర భాస్కర్ పెద్ద ఫ్యాన్. అయితే రొమాంటిక్ పాత్రల్లో నటించాలని ఉంది అని పలు సందర్భాల్లో ఆమె వెల్లడించింది. ఇటీవల షారుక్ పక్కన నటించడానికి బాలీవుడ్ తార స్వర భాస్కర్ నిరాకరించారన్న వార్త బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

వివారాల్లోకి వెళితే.. షారుక్‌తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇవ్వమని ఇటీవల ఆనంద్‌ను స్వర భాస్కర్‌ అడిగారట. దాంతో తన వద్ద షారుక్ తల్లి పాత్రమే మిగిలి ఉందని, ఒకవేళ ఇష్టమైతే ఆ పాత్ర చేయమని సూచించాడట. దాంతో కంగుతిన్న ఆమె షారుక్ పక్కన కూతురిగా, చెల్లెలుగా నటించడం ఇష్టం లేదని స్పష్టం చేసిందట.

Swara Bhaskar refuses to play Shah Rukh Khan’s mom!

స్వర భాస్కర్ గుజారీష్, తను వెడ్స్ మను, చిల్లర్ పార్టీ, ఔరంగజేబ్, రాజ్నా, తను వెడ్స్ మను రిటర్న్ చిత్రాల్లో నటించింది. తాజా ఆమె నటించిన అనార్కలి ఆఫ్ ఆరా అనే చిత్రం వివాదంలో చిక్కుకున్నది. మోతాదుకు మించి ఆమె నటించిన శృంగార సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

English summary
Swara Bhaskar refueses to play mother charecter beside Shah Rukh Khan. she told Aanand L Rai clearly that she wanted to romance King Khan and not play his sister or daughter!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu