»   » ఇంతా చేస్తే కలర్స్ స్వాతి కొద్దిసేపే కనపడుతుంది

ఇంతా చేస్తే కలర్స్ స్వాతి కొద్దిసేపే కనపడుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంలో నటిస్తున్న కలర్స్ స్వాతి..రామ్ హీరోగా రూపొందనున్న కందిరీగ చిత్రంలో నటించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రంలో కలర్స్ స్వాతి కేవలం గెస్ట్ అప్పీరియెన్స్ అనీ, కొద్ది నిముషాల పాటే కనిపిస్తుందని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మస్కాలో రామ్ సరసన చేసిన హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ద్వారా సంతోష్ శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో పాటు కలర్స్ స్వాతి..సుమంత్ సరసన..'అష్టాచెమ్మా" చిత్రంతో విజయం సాధించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండే ఈ చిత్రానికి 'అష్టాచెమ్మా" తరహాలోనే వినోదాత్మకంగా ఉంటుందంటున్నారు. ది మేన్ వితిన్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ గా ఈ చిత్రం కథ నడుస్తుంది. హరి మోహన్ కథ అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu