For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్మ అలాంటోడు అని బెదిరించాడు.. వేధింపులు తప్పలేదు.. నిఖిల్‌తో అఫైర్.. స్వాతి

  By Rajababu
  |
  వేధింపులు తప్పలేదు.. నిఖిల్‌తో అఫైర్

  ఓ టెలివిజన్ చానెల్లో కలర్స్ కార్యక్రమంతో బాలయాంకర్‌గా స్వాతిరెడ్డి విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ తర్వాత డేంజర్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. తమిళ, మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించి అందంతోనూ, అభినయంతోనూ గొప్ప నటిగా పేరుతెచ్చుకొన్నది స్వాతి.ఇటీవల వచ్చిన లండన్‌బాబులు చిత్రంలో సూర్యకాంతం పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో ఇటీవల స్వాతిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడించారు.

  కలర్స్ పాప అంటే బాధపడను

  కలర్స్ పాప అంటే బాధపడను

  కల్సర్ షో తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ కార్యక్రమంతోనే నేను పాపులర్ అయ్యాను. అలాంటప్పుడు నన్ను కలర్స్ స్వాతి అని, కలర్స్ పాప అని అంటే నేను నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది నాకు ఓ మంచి ఫీలింగ్ కలిగిస్తుంది.

  డేంజర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి

  డేంజర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి

  కలర్ షో చేస్తున్నప్పడే పెద్ద నిర్మాతల, దర్శకులు సంప్రదించారు. అప్పుడు నేను ప్రిపేర్డ్‌గా లేను. స్క్రిప్టులు కూడా నచ్చలేదు. చివరకు కథ నచ్చి, నటీనటులు ఎంపిక చూసి డేంజర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించాను.

  నేను అలా చేసి ఉంటే..

  నేను అలా చేసి ఉంటే..

  14 నుంచి 16 ఏళ్ల వయసులో సినిమాలు అంగీకరించకపోవడం నా కెరీర్‌కు మంచిదైంది. అప్పుడు చేసి ఆ సినిమాలను ఒప్పుకొని ఉంటే సుబ్రమణ్యపురం, అష్టాచెమ్మా లాంటి చిత్రాలు వచ్చేవి కాదు.

  ఆ రెండు పాత్రలతో

  ఆ రెండు పాత్రలతో

  సుబ్రమణ్యపురం, అష్టాచెమ్మా చిత్రాలు రెండు విభిన్నమైనవి. కథలు ఒకదానికి ఒకటి చాలా విభిన్నమైనది. ఒకే నెలలో ఆ రెండు చిత్రాల షూటింగ్‌లు జరిగాయి. అష్టాచెమ్మాలో ఎనర్జీ ఉండే పాత్ర.. సుబ్రమణ్యపురంలో చాలా డల్ పాత్ర. ఆ రెండు పాత్రలు పొషించడానికి కొంత కష్టమైంది.

  టాలీవుడ్‌లోనే మంచి గుర్తింపు

  టాలీవుడ్‌లోనే మంచి గుర్తింపు

  నా కెరీర్‌లో నాకు మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలు తెలుగులోనే. మలయాళంలో మంచి పాత్రలే చేశాను. కానీ తెలుగులో వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇటీవల లండన్ బాబులు చిత్రంలో పోషించిన సూర్యకాంతం పాత్ర నాకు బాగా నచ్చింది.

  అలాంటి సందర్బాలున్నాయి..

  అలాంటి సందర్బాలున్నాయి..

  వేషాల కోసం ఏదో ఆశించే వాళ్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎదురయ్యాను. కానీ నేను అలాంటి వాటిని నేను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాను అని క్యాస్టింగ్ కౌచ్ (వేషాలకు కోసం పడక గదిలోకి రమ్మనే) గురించి వివరించింది.

  వర్మ అలాంటోడు అని ..

  వర్మ అలాంటోడు అని ..

  రాంగోపాల్ వర్మతో అప్పలరాజు చిత్రంలో చేసేటప్పుడు చాలా మంది భయపెట్టారు. వర్మ అలాంటోడు, ఇలాంటోడు అని చెడుగా చెప్పారు. ఆయనతో చేయడం చాలా కష్టం అని బెదిరించారు. కానీ నేను పనిచేసిన దర్శకుల్లో చాలా విద్యావంతుడు వర్మ. జెంటిల్మెన్ మనస్తత్వం.ఆయనతో పనిచేసిన తర్వాత ఆయన మంచి గురించి బాగా తెలుసుకొన్నాను.

  నాకు వేధింపులు తప్పలేదు

  నాకు వేధింపులు తప్పలేదు

  సినీ తారలకు వేధింపులు అనేవి తప్పవు. కేవలం వేధింపులు సినిమా రంగానికే పరిమితం కాదు. సోషల్ మీడియాలో అమ్మాయిలు అయితే చాలు వేధింపులు తప్పడం లేదు. అందుకే నేను వెబ్ మీడియాను ఫాలో కాను. అలా గూగుల్ సర్చ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాను. అప్పటి నుంచి చూడటం లేదు.

  అఫైర్ వార్త చూసి షాకయ్యాను

  అఫైర్ వార్త చూసి షాకయ్యాను

  నాని, నిఖిల్, దేవీ శ్రీ ప్రసాద్, సునీల్ లాంటి వారితో అఫైర్లు అంటగట్టారు. ఒకప్పుడు నేను వాటిని చూసి నేను నవ్వి ఊరుకునే దానిని. అల్లరి నరేష్‌తో అఫైర్ నడుపుతున్నాను అని వార్త చూసి షాక్ అయ్యాను. పొగ లేకుండా నిప్పు ఎలా వస్తుందనే ఆలోచనలో పడ్డాను.

  నిఖిల్‌తో అఫైర్ బాధించింది..

  నిఖిల్‌తో అఫైర్ బాధించింది..

  నిఖిల్‌తో అఫైర్ వార్త చూసి అయ్యా బాబోయ్ అనుకొన్నాను. సాధారణంగా మేమంతా గ్రూప్‌గా కలుస్తాం. ఆ సందర్భంగా కొన్నిసార్లు చాలా బాధపడ్డాను. లైట్‌గా తీసుకోకపోయినా నిఖిల్, నన్ను ఇబ్బందికి గురిచేశాను.

  త్రివిక్రమ్ రిక్వెస్ట్ మేరకు

  త్రివిక్రమ్ రిక్వెస్ట్ మేరకు

  త్రివిక్రమ్ శ్రీనివాస్ రిక్వెస్ట్ మేరకు జల్సాలో ఇలియానాకు డబ్బింగ్ చెప్పాను. నేను చెప్పిన డబ్బింగ్‌కు నాకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కూడా నాకు డబ్బింగ్ అవకాశాలు వచ్చాయి. కానీ సమయం లేని కారణంగా ఒప్పుకోలేదు.

  English summary
  Actor Swathi Reddy is well known for best reason. She entered into Television industry with Colours show. After that Swathi entered into Tollywood with Danger movie. Tamil, Malayalam movies gets good recongnisation in 14 years of career span. She recently spoke to media and revealed so many issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X