»   » నిర్మాత కొడుకుతో కలర్స్ స్వాతి రొమాన్స్!

నిర్మాత కొడుకుతో కలర్స్ స్వాతి రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలర్స్ స్వాతి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమె నటించిన త్రిపుర మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. అయితే స్వాతి పెర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కలర్స్ స్వాతి మరో ప్రాజెక్టు కమిటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఖరారైనట్లు తెలుస్తోంది.

Swathi Reddy romance with Bellamkonda Srinivas

ఈ చిత్రానికి గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒక హీరోయిన్ గా స్వాతిని ఎంపిక చేసినట్లు టాక్. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. క‌న్న‌డ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. త‌మిళ్ లో విజ‌యం సాధించిన సుంద‌ర‌పాండ్యిన్ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. తమిళంలో విజయంతమైన 'సుందరిపాండ్యన్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'స్పీడున్నోడు' అనే పేరు ప్రచారంలో ఉంది.

Swathi Reddy romance with Bellamkonda Srinivas

తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా ఈ సినిమాను రూపొందించి విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

English summary
Bellamkonda Suresh is producing his son Srinivas with Bheemineni Srinivasa Rao. Besides he also planned another big budget movie with director Vijay Kumar of GJG fame. The story line for this is already okayed. Now it is learnt that for this film Swathi has been booked for the movie. It seems the movie will have two female leads and Swathi will be one!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu