కలర్స్ స్వాతి 'త్రిపుర' టీజర్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్: కలర్స్ స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి 'తిరుపుర సుందరి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి స్టేజికి చేరుకుంది. ఈ సందర్బంగా టీజర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ చూస్తున్నది అదే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాతలు చినబాబు, రాజశేఖర్ లు మాట్లాడుతూ - '' రాజకిరణ్ దర్శకత్వంలో రూపొందిన 'గీతాంజలి'కి మించిన ఉత్కంట భరితంగా ఈ చిత్రం ఉంటుంది. స్వాతి మంచి నటి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను అద్భుతంగా చేస్తోంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చూసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. '' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘ ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపుదిద్దుకొనే ఈ సినిమాలో స్వాతి ఇంతవరకూ చేయని ఓ విభిన్న పాత్ర పోషిస్తోంది. నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా అవుతుంది' అని తెలిపారు.

Swathi Reddy’s Tripura teaser

అలాగే - "కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ సమకూర్చిన స్క్రీన్ ప్లే ప్రధాన బలంగా నిలుస్తుంది. కమ్రాన్ అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇందులో ఉన్న నాలుగు పాటలకు చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందిస్తున్నారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.​​​

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X