»   » మొదట ఎమ్.ఎస్.రాజు కొడుకుతో...శ్వేతాబసు

మొదట ఎమ్.ఎస్.రాజు కొడుకుతో...శ్వేతాబసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కొత్తబంగారు లోకం' కంటే ముందు నాకు ఎం.ఎస్‌.రాజు బేనర్‌లో అవకాశం వచ్చింది. ఆయన కుమారుడు సుమంత్‌ హీరోగా ప్లాన్‌ చేసిన సినిమా అది. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్ళకుండానే ఆగింది. అప్పుడు చాలా బాధపడ్డాను. నిరాశపడ్డాను. అయితే అంతలోనే 'దిల్‌' రాజు దగ్గరి నుంచి అవకాశం రావడం జరిగింది' అంటూ చెప్పుకొచ్చారు శ్వేతా బసు. ఇక కొత్తబంగారు లోకం చిత్రం తర్వాత శ్వేతా బసు..తెలుగులో రైడ్ చిత్రం చేసింది. ఆ తర్వాత నిఖిల్ హీరోగా వచ్చిన కళావర్ కింగ్ లో కనిపించింది. ప్రస్తుతం బెల్లంకొండ నిర్మాతగా పూరీ డైరక్షన్ లో బాలయ్య హీరోగా చేసే చిత్రంలో బుక్కయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu