»   » 'షీ'గా శ్వేత మీనన్: ఆమె సరసన హీరో ఎవరో..

'షీ'గా శ్వేత మీనన్: ఆమె సరసన హీరో ఎవరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజన్న ఫేమ్ శ్వేత మీనన్ తెలుగులో 'షీ' అనే సినిమాలో దర్శనమివ్వబోతున్నది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) నిర్మాతగా మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'షీ' (ఈజ్ వెయిటింగ్).

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్వేత మీనన్ పై తాజాగా ఫోటోషూట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) మాట్లాడుతూ.. 'అతి త్వరలో ఒక మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభిస్తామని తెలిపారు. నవంబర్, డిసెంబర్ కల్లా చిత్ర షూటింగ్ పూర్తి చేసి మార్చిలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.

Swetha Menon to act in She: hero not yet decided

సినిమాలో హీరోతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర తెలిపారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - పర్స రమేష్ మహేంద్ర

English summary
Rajanna fame Swetha menon to act in Telugu film She.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu