For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సైరా సీన్ బై సీన్ రివ్యూ: లవ్, ఎమోషన్స్, హై ఓల్టేజ్‌తో.. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంపై సైరా

  |

  కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై సినీ హీరో రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా సైరా నర్సింహారెడ్డి చిత్రానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కిస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోని భావోద్వేగంతో కూడిన ప్రధాన సీన్లు ఇలా ఉన్నాయి.

  సైరా ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్ముడేనట.. తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే!

  1857‌లో సిపాయి తిరుగుబాటు

  1857‌లో సిపాయి తిరుగుబాటు

  సైరా సినిమా నిడివి 171 నిమిషాలు. బకింగ్ హమ్ ప్యాలెస్‌ సీన్‌తో సైరా మూవీ ప్రారంభమవుతుంది. 1857లో జరిగే సిపాయిల తిరుగుబాబు ఎపిసోడ్‌తో నేరుగా కథలోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కట్ చేస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్యం నాటి సీన్లతో కథ ఎమోషనల్ టచ్‌తో సాగింది.

  బిగ్‌బీ, నాజర్, తమన్నా ఎంట్రీలు

  బిగ్‌బీ, నాజర్, తమన్నా ఎంట్రీలు

  నరసింహారెడ్డి తాతగా నాజర్ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ క్రమంలోనే గురువు గోసాయి వెంకన్న పాత్రలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ అదిరిపోయేలా ఉంటుంది. ఈ నేపథ్యంలో జల అడుగుభాగంలో అద్బుతమైన సీన్ చిరంజీవి, నర్తకి లక్ష్మీగా తమన్నా పరిచయం అయింది.

  ఎద్దులతో పోరాటం

  ఎద్దులతో పోరాటం

  కథ, కథనాలు ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ సామంత రాజుల పాత్రల్లో జగపతిబాబు, రవికిషన్, కిచ్చ సుదీప్, ముఖేష్ రుషి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. ఎద్దులతో యాక్షన్ సీన్లను దర్శకుడు సురేందర్ రెడ్డి, సినిమాటోగ్రఫర్ రత్నవేలు అద్బుతంగా తెరకెక్కించారు.

  రేనాడు ప్రాంతంపై బ్రిటీష్ కబ్జా

  రేనాడు ప్రాంతంపై బ్రిటీష్ కబ్జా

  రేనాడు ప్రాంతాన్ని బ్రిటీష్ ప్రభుత్వం కబ్జా చేసే ప్రయత్నాల మధ్య నరసింహారెడ్డి, లక్ష్మీ లవ్ స్టోరి చాలా సెన్సిబుల్‌గా కనిపిస్తుంది. అలాగే సిద్ధమ్మగా నయనతార పాత్ర ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నర్సింహారెడ్డి, సిద్దమ్మ పెళ్లి ఎపిసోడ్‌ తెర లేచింది.

  ఎమోషనల్‌గా జాగో పాట

  ఎమోషనల్‌గా జాగో పాట

  సైరా సినిమాకు ఆణిముత్యంగా మారిన జాగో పాట కన్నులపండువగా కనిపిస్తుంది. వేలాది మంది, అద్భుత సెట్టింగులు సినిమాకు మరింత రిచ్ ఫీలింగ్ తీసుకు వచ్చింది. ఈ పాట చిత్రీకరణ హైలెట్‌గా నిలిచింది.

  సైరా తిరుగుబాటు

  సైరా తిరుగుబాటు

  కథలో కీలక సన్నివేశాలు చోటుచేసుకోవడం, స్టోరి అనేక మలుపు తిరగడం, నరసింహారెడ్డిపై ప్రభావం పడడంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై అతడి తిరుగుబాటుకు మొదలైంది. తెల్లదొరలపై తన వార్ ప్రకటించాడు. ఒంటరి పోరుతో బ్రిటీష్ వారికి దడపుట్టిస్తున్నాడు.

  సుదీప్, విజయ్ సేతుపతి

  సుదీప్, విజయ్ సేతుపతి

  కథ హై వోల్టేజ్‌తో వెళ్తుంటే.. స్టోరిలో ఒక ట్విస్ట్ మొదలైంది. ఓ ప్రధానమైన పాత్రతో సుదీప్ కిచ్చ ఎంట్రీ సినిమాకు ప్రాణం పోసింది. సుదీప్ నటన మరింత ప్లస్‌గా మారింది. అలాగే తమిళ పోరాట యోధుడిగా విజయ్ సేతుపతి పాత్ర పరిచయం అయింది. ఓ సైరా పాట రోమాలు నిక్కబొడిచేలా ఉంది. తమన్నా డ్యాన్స్ మరింత ఆకట్టుకొంది.

  మహా సంగ్రామం ఎపిసోడ్‌తో

  మహా సంగ్రామం ఎపిసోడ్‌తో

  సైరాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే మహా సంగ్రామం ఎపిసోడ్‌తో సినిమా మరింత ఎమోషనల్‌గా మారింది. చిరంజీవితో‌పాటు కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు వార్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

  Chiranjeevi Explained How Amitabh Bachchan Exempted Syeraa Offer
  ఉరికంబం ఎక్కే సీన్

  ఉరికంబం ఎక్కే సీన్

  ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. సైరా నర్సింహారెడ్డి ఉరికంబం ఎక్కే సీన్ ఆడియెన్స్‌ను ఎమోషనల్‌గా మారుస్తుంది. చివరి పది నిమిషాలు సినిమా హై వోల్జేజ్‌గా ఉంటుంది.

  English summary
  Sye Raa movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October. In this occassaion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X