twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' వివాదం...తెలంగాణా వాదుల సపోర్టు

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' చిత్ర వివాదంలో బ్రాహ్మణులపై దాడికి వారికి తెలంగాణా వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణుల మీద జరిగిన దాడులపై చర్యలు తీసుకునేలా సర్కారును ఆదేశించాలని హెచ్చార్సీని కోరేందుకు తెలంగాణ న్యాయవాదులు కూడా వచ్చారు. అంతేగాక తెలంగాణ ప్రజల చందాలతో మోహన్‌బాబు లాంటి వారు బతుకుతున్నారని స్వామిగౌడ్ మండిపడ్డారు. కలెక్షన్‌లను కట్టెలుగా మార్చుకొని దాడులు చేస్తున్నారని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    బ్రాహ్మణుల పట్ల మోహన్‌బాబు కుటుంబసభ్యులు దుర్మార్గంగా వ్యవహరించారని తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బ్రాహ్మణులపై దాడిని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ఖండించారు. తమ సంఘాల నేతలు తలుచుకుంటే మోహన్‌బాబు, మంచు విష్ణు సహా ఆయన కుటుంబ సభ్యుల సినిమాలు ఏవీ తెలంగాణలో ఒక్క ఆట కూడా ఆడబోవని దేవీప్రసాదరావు, శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మోహన్‌బాబు, విష్ణు క్షమాపణ చెప్పాలని తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, ధన్వంతరి ఫౌండేషన్ కమలాకరశర్మ, అంబాప్రసాద్‌శర్మ, రామదత్తుశర్మ, శ్యామ్‌ప్రసాద్‌శర్మ డిమాండ్ చేశారు. తెలంగాణాలో పలు ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

    హిందూ జాతిని కించపర్చేలా తీసిన 'దేనికైనా రెడీ' సినిమా నిర్మాత, దర్శకులపై కేసులు నమోదుచేసి, జైల్లో పెట్టాలని కిషన్‌రెడ్డి అన్నారు. బ్రాహ్మణులను కించపరిచేలా 'ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం', 'దేనికైనా రెడీ' లాంటి చిత్రాలు తీయడం అమానుషమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని.. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

    ఈ చిత్రాన్ని నిషేధించాలని టీడీపీ నేతలు వేమూరి ఆనందసూర్య, ఏవీ రమణ, అన్నదానం సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఇకపై సినిమా షూటింగ్‌లు, ఫంక్షన్లకు హాజరయ్యేది లేదని బ్రాహ్మణ సమాఖ్య స్పష్టం చేసింది. బ్రాహ్మణుల మనోభావాలను, హిందు మత విశ్వాసాలను దెబ్బతీశారనే ఫిర్యాదు మేరకు గురువారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో నిర్మాత, దర్శకుడు, హీరో, డైలాగ్‌రైటర్‌తో పాటు, సెన్సార్‌బోర్డు అధికారిణి ధనలక్ష్మిలపై ఐపీసీ 150 ఎ, 295, 298, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏపీ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య కార్యదర్శి శ్రీధర్ ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    English summary
    Manchu Vishnu who has thrown a challenge to go for any extent (‘Denikaina Ready’) is ready to fight a legal battle with Brahmin Associations and now, the newly joined Telangana Lawyers. Troubles for Manchu family might be increasing now in Telangana. While Brahmins in this region and other parts of the state are openly expressing their anger on ‘Denikaina Ready,’. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X