For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హీరో అలా చేయడంతొ బాధపడ్డా... రూ. కోటితో వెళ్లి పోయా: తాప్సీ

  By Bojja Kumar
  |

  తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన తాప్సీ ఇక్కడ సరైన సక్సెస్ అందక పోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసి ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే ఆమె మన ఇండస్ట్రీని వదిలేసిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమపై పలు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తలో నిలుస్తోంది. అప్పట్లో ఆమె రాఘవేంద్రరావు మీద చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఈ ఢిల్లీ బ్యూటీ ఈ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

  ఆ హీరో చేసిన నిర్వాకం గురించి

  ఆ హీరో చేసిన నిర్వాకం గురించి

  ఈ సందర్భంగా తాను తెలుగు సినిమా పరిశ్రమలో ఓ హీరో మూలంగా బాధ పడ్డ సందర్భాన్ని వివరించారు. తాను ఓ తెలుగు హీరో సినిమాలో నటిస్తున్నపుడు తనకు ముందుగా చెప్పిన ప్రకారం కాకుండా ఇంట్రడక్షన్ సీన్ మార్చేశారని, షూటింగ్ స్పాట్ కు వచ్చే వరకు తనకు ఆ విషయం చెప్పలేదని, దర్శకుడిని ఇదేంటని అడిగితే ‘హీరోగారు మార్చమన్నారు' అని సమాధానం ఇచ్చారని తాప్సి తెలిపారు.

  Bigg Boss Telugu :Tapsee Revealed this week Elimination | Filmibeat Telugu
  చాలా బాధ పడ్డాను

  చాలా బాధ పడ్డాను

  ఈ విషయం నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు అని దర్శకుడిని అడిగితే.... ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదని భావించాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, ఈ సంఘటనతో తాను చాలా బాధ పడ్డానని తాప్సీ వెల్లడించారు.

  గౌరవం ఉన్న చోటే పని చేయాలనుకున్నా

  గౌరవం ఉన్న చోటే పని చేయాలనుకున్నా

  అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు గౌరవం ఇచ్చే వారితో, నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో, నా కోసం వెయిట్ చేసే వారికి మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను..... అని ఈ సందర్భంగా తాప్సీ చెప్పుకొచ్చారు.

  నా కోసం సంవత్సరం వెయిట్ చేశారు

  నా కోసం సంవత్సరం వెయిట్ చేశారు

  బాలీవుడ్ వైపు వెళ్లిన తాను మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి ‘ఆనందో బ్రహ్మ' చిత్రం చేయడానికి కారణం వారు నా కోసం సంవత్సరం పాటు వెయిట్ చేశారని, నా పాత్రకు ప్రధాన్యం ఉండటంతో పాటు నాకు అక్కడ రెస్పెక్ట్ ఉంది కాబట్టే చేశాను అని తాప్సీ వెల్లడించారు.

  ప్రాపిట్ షేర్ కింద రూ. కోటి తీసుకుని వెళ్లిపోయాను

  ప్రాపిట్ షేర్ కింద రూ. కోటి తీసుకుని వెళ్లిపోయాను

  ‘ఆనందో బ్రహ్మ' చిత్రం మంచి విజయం సాధించింది. నా ప్రాఫిట్ షేర్ కింద రూ. కోటి రూపాయలు తీసుకుని ఈ ఇండస్ట్రీ నుండి వెళ్లి పోయాను అని తాప్సీ తెలిపారు.

  నిర్మొహమాటంగా చెప్పిన తాప్సీ

  నిర్మొహమాటంగా చెప్పిన తాప్సీ

  సాధారణంగా సినిమా తారలు తమ పారితోషికాల వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తారు. దాని వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయనేది వారి భయం. అయితే తాప్సీ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం దాపరికం లేకుండా ఉన్న విషయం చెప్పారు.

  ఐరన్ లెగ్ అంటూ ముద్ర

  ఐరన్ లెగ్ అంటూ ముద్ర

  టాలీవుడ్లో హీరోయిన్ తాప్సీకి ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా ఉంది. దీని కారణంగా ఆమె అవకాశాల పరంగా, రెమ్యూనరేన్ పరంగా, పాత్రల పరంగా చాలా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంది.

  English summary
  "Recently I've done a Telugu movie Anando Brahma only because they have waited for me for one year. And also I've done it on a profit-sharing basis and walked away with a one crore money as my share from this industry. I will do only those films that will wait for me and honour me". Tapsi said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more