»   » అక్కనే మించిపోతోంది..తాప్సి చెల్లికి అలాంటి పరిస్థితి, ఆ అందాలు చూస్తే!

అక్కనే మించిపోతోంది..తాప్సి చెల్లికి అలాంటి పరిస్థితి, ఆ అందాలు చూస్తే!

Subscribe to Filmibeat Telugu

సొట్ట బుగ్గల సుందరిగా పాపులర్ అయిన తాప్సి టాలీవడ్ లో పలు చిత్రాల్లో నటించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఝుమ్మందినాదం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. మొదట్లో తాప్సి క్యూట్ లుక్స్ అందరిని ఆకర్షించాయి. నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత విజయాలు లేకపోవడం, విమర్శలు రావడంతో బాలీవుడ్ బాట పట్టింది. వరుస హిట్లతో తాప్సి బాలీవుడ్ లో మంచి జోష్ లో ఉంది. చిత్ర పరిశ్రమల్లో తన పాపులారిటీతో తన సోదరి షాగున్ ని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందనేది లేటెస్ట్ టాక్.

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో

తాప్సి రాఘవేంద్ర రావు దర్శత్వంలో ఝుమ్మందినాదం చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తాప్సి సొట్ట బుగ్గలు, క్యూట్ లుక్స్ తెలుగు ఆడియన్స్ ని ఆకర్షించాయి. ఆ తరువాత తాప్సి పలు చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది.

విజయాలు కరువు

విజయాలు కరువు

తాప్సి డెబ్యూ మూవీ పరవాలేదనిపించినా ఆ తరువాత విజయాలు కరువయ్యాయి. తాప్సికి సరైన హిట్ దక్కలేదు. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం వంటి చిత్రాలు మినహా మిగిలిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు.

తాప్సిపై విమర్శలు

తాప్సిపై విమర్శలు

తాప్సికి టాలీవుడ్ లో ఛాన్సులు కరువవుతున్న తరుణంలో ఆమె గ్లామర్ విషయంలో కూడా విమర్శలని ఎదుర్కొంది. ఇక లాభంలేక బాలీవుడ్ బాట పట్టింది.

కొత్తగా మలచుకుని

కొత్తగా మలచుకుని

తాప్సి బాలీవుడ్ తనని తాను కొత్తగా మలచుకుని విజయాలు సాధించింది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ కూడా ఒలకబోసింది. వరుణ్ ధావన్ తో నటించిన జుడ్వా 2 చిత్రంలో బికినిలో కూడా మెరిసింది. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో కొనసాగుతోంది.

చెల్లి కోసం ప్రయత్నాలు

చెల్లి కోసం ప్రయత్నాలు

తాప్సి తన చెల్లెలు షాగున్ ని వెండి తెరకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తనకు పరిచయం ఉన్న టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలతో షాగున్ విషయాన్ని ప్రస్తావిస్తోందట. వీలైనంత త్వరగా తన సోదరిని సినిమాల్లోకి తీసుకురావడానికి తాప్సి ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

అలాంటి పరిస్థితి రాకూడదని

అలాంటి పరిస్థితి రాకూడదని

తాను సినిమా అవకాశం పొందడానికి చాలా కష్టపడవలసి వచ్చిందని తాప్సి చెబుతుంటుంది. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి కూడా చాలా కష్టపడ్డానని తాప్సి తెలిపింది. అందంగా లేనని విమర్శలు సైతం ఎదుర్కొంది. అలాంటి పరిస్థితి తన సోదరికి రాకూడదని, మంచి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా సోదరికోసం ప్రయత్నాలు చేస్తోందట.

 అక్కని మించే అందం

అక్కని మించే అందం

తాప్సి సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గ్లామర్ విషయంలో హద్దులు పాటించింది. కానీ షాగున్ మాత్రం సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో కుర్రకారుని ఉడికించే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో షాగున్ పోస్ట్ చేసే పిక్స్ చూస్తే కుర్రకారు మతి పోవలసిందే.

English summary
Taapsee to introduce her sister. Taapsee in talks with some directors and producers
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu