»   » రాఘవేంద్ర రావుకు అవమానం: హీరోయిన్ తాప్సీపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్

రాఘవేంద్ర రావుకు అవమానం: హీరోయిన్ తాప్సీపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును అవమానించే విధంగా హీరోయిన్ తాప్సీ ఓ హిందీ టీవీ కార్యక్రమంలో మాట్లాడటంపై తెలుగు సినీ అభిమానులు మండి పడుతున్నారు. నీకు సినీ జీవితాన్ని ఇచ్చిన దర్శకుడిపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏమిటని ఫైర్ అవుతున్నారు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఝుమ్మందినాదం' సినిమా ద్వారా తాప్సీ హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ చిత్రంలో మంచు మనోజ్ హీరో. తన తొలి సినిమాలో దర్శకుడు బొడ్డుపై పూలు, పండ్లు, కొబ్బ‌రికాయ‌లు విసిరారంటూ తాప్సీ హేళనగా మాట్లాడింది. డైరెక్టర్‌ తీరుతో త‌న‌కు భయమేసిందని వ్యాఖ్యానించింది.

తాప్సీ అప్పుడు అలా... ఇపుడు ఇలా

తనను పరిచయం చేసిన దర్శకుడిపై తాప్పీ అప్పట్లో ఎలా మాట్లాడింది, ఇపుడు ఎంత నీచంగా మాట్లాడిందో ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది.

తాప్సీ ఓవర్ యాక్షన్

తాప్సీ ఓవర్ యాక్షన్

తాప్సీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది, తనకు సినీ జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు గురించి చాలా నీచంగా మాట్లాడుతోంది అంటూ తెలుగు సినీ అభిమానులు మండి పడ్డారు.

ఇది ఆయన తప్పే..

ఇది ఆయన తప్పే..

అవును... నీ లాంటిదాన్ని తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా పరిచయం చేసి రాఘవేంద్రరావు తప్పు చేశారు. ఆయన ఆ రోజు అలా చేశారు కాబట్టే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావ్ అంటూ తాప్సీ మీద ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ అభిమానులు.

తాప్సీ ఇది కరెక్ట్ కాదు...

తాప్సీ ఇది కరెక్ట్ కాదు...

తాప్సీ నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు... ఒక గొప్ప దర్శకుడిని అవామానించే విధంగా మాట్లాడావ్, తెలుగు సినీ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసే విధంగా మాట్లాడావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Tollywood fans fired on heroine Tapsee about Raghavendra rao issue. Tapsee insult the great south india director Ragvendra Rao with her comments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu