»   » 'ఘాజి'ని ముంచి నేషనల్ అవార్డు.. తాప్సి రియాక్షన్!

'ఘాజి'ని ముంచి నేషనల్ అవార్డు.. తాప్సి రియాక్షన్!

Subscribe to Filmibeat Telugu

దగ్గుబాటి రానా నటించిన ఘాజి చిత్రం ఉత్తమ తెలుగు భాషా చిత్రంగ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. 1971 ఇండియా, పాక్ వార్ సందర్భంగా అనూహ్య రీతితో పాక్ సబ్మెరైన్ పి ఎం ఎస్ ఘాజి మునిగిపోయిన సంగతి తెలిసిందే. పాక్ సబ్మెరైన్ ని తామే ముంచామని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. ఈ సమాచారం ఆధారంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రానా ప్రధాన పాత్రలో నేవి అధికారిగా అదరగొట్టాడు.

ఘాజి చిత్రంలో తాప్సి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ వార్త వినిగానే తనకు చాలా సంతోషం అనిపించిందని తాప్సి మీడియాతో తెలిపింది. జాతీయ అవార్డుగెలుపొందిన చిత్రంలో తాను పలు పంచుకోవడం ఇది మూడవ సారి అని తాప్సి తెలిపింది. తాను ఈ చిత్రంలో చేసిన స్పెషల్ రోల్ మాత్రమే. అయినా కూడా తనకు చాలా సంతృప్తిగా ఉందని తాప్సి పేర్కొంది.


Taapsee on National Film Award for Ghazi

ఘాజి చిత్రం పూర్తి స్థాయిలో అండర్ వాటర్ మిషన్ గా రూపొందింది. తాప్సి నటించిన అందుకాలం, పింక్, ఘాజి చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. ఘాజి చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలై మంచి విజయం సాధించింది.

English summary
Taapsee on National Film Award for Ghazi. Ghazi win the National award as best Telugu movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X