»   » రాఘవేంద్రరావు చేసిందే చెప్పాను.. అందులో తప్పేమీలేదు.. పనిలేని వాళ్లను పట్టించుకొను.. తాప్సీ

రాఘవేంద్రరావు చేసిందే చెప్పాను.. అందులో తప్పేమీలేదు.. పనిలేని వాళ్లను పట్టించుకొను.. తాప్సీ

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావును తాను అవమానించే విధంగా ప్రవర్తించలేదని బాలీవుడ్ నటి తాప్సీ పన్ను వివరణ ఇచ్చింది. పాటల చిత్రీకరణ సందర్భంగా హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లతో కొట్టే రాఘవేంద్రరావు తన నాభీ ప్రాంతంపై కొబ్బరిచిప్పతో కొట్టాడని, అలా కొట్టడం వల్ల ఎలాంటి శృంగారం ఉందో నాకు అర్థం కాలేదని ఆమె ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కామెడీ గ్రూప్ నిర్వహించిన చర్చవేదికలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సినీ అభిమానులు తాప్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందించి వివరణ ఇచ్చింది.

రాఘవేంద్రరావుకు వెన్నుపోటు

రాఘవేంద్రరావుకు వెన్నుపోటు

తాప్సీ చేసిన కొబ్బరిచిప్ప వ్యాఖ్యలు వెబ్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో తనను పరిచయం చేసిన రాఘవేంద్రరావును చులకన చేసి మాట్లాడటం తగదు అని నెటిజన్లు రచ్చరచ్చ చేశారు. అంతేకాకుండా కృతజ్క్షత లేని వ్యక్తి అని, హిపోక్రాట్, వెన్నుపోటు పొడిచింది అంటూ తాప్సీపై విరుచుకుపడ్డారు. సినీ పరిశ్రమలో లెజెండ్ లాంటి రాఘవేంద్రరావుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు.

నేనేమీ తప్పు పట్టలేదు..

నేనేమీ తప్పు పట్టలేదు..

సోషల్ మీడియాలో దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో ఓ జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్‌‌తో మాట్లాడుతూ.. నేనేమీ తప్పు మాట్లాడాను. ఆయన స్టయిల్ అది. నేను నిజం చెప్పాను. దానిని మీరు తప్పుగా భావిస్తే అది మీ ప్రాబ్లం అని తాప్సీ పెర్కోన్నది. మీరు నమ్మండి.. నమ్మకపోండి.. నేను చేసిన వ్యాఖ్యలకు ఆయన గానీ, నేను గానీ బాధపడలేదు అని తాప్సీ చెప్పింది.

Watch The Ghazi Attack Trailer Rana Daggubati, Taapsee
రాఘవేంద్రరావు ఫీల్ కాలేదు..

రాఘవేంద్రరావు ఫీల్ కాలేదు..

ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రూప్‌ చర్చ సందర్భంగా మాట్లాడిన వీడియోను రాఘవేంద్రరావు గారు ఆయన కుటుంబంతోపాటు చూశారు. నేను కూడా మరోసారి చూశాను. ఆ ఘటన తర్వాత వీడియో గురించి మాట్లాడుకొని మేమంతా నవ్వుకున్నాం అని తాప్సీ మీడియాకు వెల్లడించింది. నేను మాట్లాడిన దానిలో రాఘవేంద్రరావుకు తప్పేమీ అనిపించలేదు. అందుకు వేరెవరో బాధపడితే నా తప్పు కాదు అని తాప్సీ అభిప్రాయపడింది.

కొబ్బరిచిప్పతో కొడుతారని అనుకోలేదు

కొబ్బరిచిప్పతో కొడుతారని అనుకోలేదు

ఎవరినో కించపరుచడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదు. అసలు నా ఉద్దేశం అది కాదు. ఆ పాటలో కొబ్బరి చిప్పతో కొడుతారని నాకు తెలియదు. నేను అందుకు సిద్ధంగా లేను. అలా నా బొడ్డుపై కొబ్బరిచిప్పతో కొట్టడం వల్ల అందులో శృంగారం ఏముందో నాకు అర్థం కాలేదు అని మరోసారి తాప్సీ తన వ్యాఖ్యలను రిపీట్ చేసింది.

ఎవరికో సమాధానం చెప్పుకోవాల్సిన..

ఎవరికో సమాధానం చెప్పుకోవాల్సిన..

బొడ్డుపై కొబ్బరిచిప్పతో కొట్టడం అనే వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని నేను భావిస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాను. ఈ వివాదంలో ఏ ఒక్కరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం నా ఉద్దేశం కాదు. నేను వాస్తవాలే మాట్లాడానని మరోసారి చెప్తున్నాను. ఎవరో ఒకరిపై బురద చల్లడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు చేసే పనికి సమాధానం చెప్పడానికి నేను సిద్దంగా లేను. అలాంటి పనిలేని వాళ్ల గురించి నేను పట్టించుకోను అని తాప్సీ అన్నారు.

English summary
Actor Taapsee Pannu condemned allegations made on social media. She was attacked making fun of Telugu film director Raghavendra Rao who launched her, says that she did no such thing, and that both she and Rao are laughing about her remarks. Tapsee said I’ve seen the video and he has seen it, too, along with his family, and we are all laughing at it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu