»   » సినీనటి తాప్సీకి చేదు అనుభవం.. ఢిల్లీలో అభిమానులు చుట్టుముట్టి

సినీనటి తాప్సీకి చేదు అనుభవం.. ఢిల్లీలో అభిమానులు చుట్టుముట్టి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో పింక్, నామ్ షబానా చిత్రాల తర్వాత సినీ నటి తాప్సీ పొన్నుకు అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఆ చిత్రాల్లో ఆమె నటన అభిమానులను, విమర్శకులను మెప్పించింది. దాంతో తాప్సీ ఎక్కడ కనిపించినా సెల్ఫీల గోల ఎక్కువైపోతుందట. ఇటీవల అభిమానుల తాకిడి ఎక్కువ చుట్టుముట్టడంతో తాను ఎక్కాల్సిన ఫ్లయిట్‌ను మిస్ చేసుకొందట. దీంతో జుడ్వా2 షూటింగ్‌కు చేరుకోవడంలో ఆలస్యమైందనే తాజా సమాచారం.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అభిమానులు చుట్టుముట్టి

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అభిమానులు చుట్టుముట్టి

సినీ నటి తాప్సీకి ముంబై వెళ్లడానికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకొన్నది. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను చూడగానే సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. సెల్పీలు దిగడానికి పోటీ పడ్డారు. వారి అభిమానాన్ని కాదనలేక వారితో సెల్ఫీలు దిగడం ప్రారంభించింది. ఆ గోలలో టైమ్ చూసుకోకపోవంతో ఎక్కాల్సిన ఫ్లయిట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి తుర్రుమన్నది. దాంతో మరో ఫ్లయిట్ వచ్చే వరకు వేచి చూసి ఢిల్లీకి వెళ్లిందనేది తాజా సమాచారం.

సాధారణంగా ఫోటోలు దిగడానికి ఒప్పుకొను..

సాధారణంగా ఫోటోలు దిగడానికి ఒప్పుకొను..

ఎయిర్‌పోర్ట్, పబ్లిక్ మాల్స్‌లో ఎవరైనా అభిమానులు కనిపించి ఫొటో దిగుతాము అంటే ఒప్పుకోను. ఎందుకంటే నేను ప్రయాణించేటప్పుడు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొను. నా వెంటే వారు ఉండకపోవడంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను. ఒకవేళ సెల్ఫీలకు ఒప్పుకొంటే ఒక్కోసారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొన్నిసార్లు అభిమానులు చూపించే ప్రేమ మనసును కలిచివేస్తుంది. కానీ తనకు ఉండే పరిమితుల వల్ల అలా చేయాల్సి వస్తుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

స్కూల్, కాలేజీ పిల్లలు అభిమానాన్ని కురిపిస్తుంటారు

స్కూల్, కాలేజీ పిల్లలు అభిమానాన్ని కురిపిస్తుంటారు

ఇటీవల ఢిల్లీలో జరిగిన సంఘటన అందుకు నిదర్శనమని తాప్సీ వెల్లడించింది. అభిమానుల కోరికను కాదనలేక ఫొటోలు దిగితే ఫ్లయిట్ వదులుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు వారు కురిపించే అభిమానాన్ని కాదనలేను అని తాప్సీ చెప్పింది. తాను విదేశాలకు వెళ్లినా, లేదా షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినా స్కూల్, కాలేజీ పిల్లలు ఫొటోల కోసం వెంటపడుతారని ఆమె చెప్పుకొచ్చింది.

జుడ్వా2 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన

జుడ్వా2 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన

ప్రస్తుతం తాప్సీ జుడ్వా2 చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తున్నది. ఈ చిత్రం 1997లో సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి సీక్వెల్. జుడ్వా చిత్రాన్ని తెలుగులో విజయం సాధించిన హలో బ్రదర్ చిత్రానికి రీమేక్. జుడ్వా చిత్రం కూడా బాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ సాధించింది. ప్రస్తుతం సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో వరుణ్ ధావన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులు నటిస్తున్నారు.

English summary
Taapsee Pannu was recently in Delhi to spend time with her family and close friends. However, the actor, who was to take a flight back to Mumbai missed it because of her fans. According to sources, fans gathered outside the Delhi airport to get a glimpse of Taapsee and requested for selfies. She ended up taking the next flight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu