»   »  గొప్ప నటిని కాదు.. పాత్రల కోసం దిగజారలేదు.. తాప్సీ

గొప్ప నటిని కాదు.. పాత్రల కోసం దిగజారలేదు.. తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొన్నేండ్లుగా బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలో నటిస్తున్న తాప్పీ పొన్ను ఖాతాలో సరైన హిట్లు పడలేదు. బేబీ, పింక్ చిత్రాలు తాప్పీ కేరీర్‌కు మంచి జోష్‌ను ఇచ్చాయి. ప్రస్తుతం త్వరలో విడుదల కానున్న రన్నింగ్‌షాదీ.కామ్, ది ఘాజీ అటాక్, నామ్ షబానా చిత్రలపైనే ఆశలు పెట్టుకొన్నది.

 45 రోజులు.. మూడు చిత్రాలు

45 రోజులు.. మూడు చిత్రాలు


బేబీ విజయం తర్వాత కెరీర్‌పై తాప్సీ సీరియస్‌గా దృష్టిపెట్టింది. గత 45 రోజుల్లో 3 చిత్రాల కోసం బిజీ బిజీగా పనిచేసింది. నా జీవితంలో ఇది ఓ రికార్డు. ఈ ఘనతను ప్రతీ ఒక్కరు గుర్తించాల్సి ఉంది. ఈ చిత్రాలు వచ్చే ఐదు వారాల వ్యవధిలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆమె నటించిన ఘాజీ చిత్రం శుక్రవారం రోజున విడుదలవుతున్నది.

 ప్లాన్ చేయలేదు.. అలా జరిగింది..

ప్లాన్ చేయలేదు.. అలా జరిగింది..


ఈ మూడు చిత్రాల కోసం ఎన్నడూ అనుకొని ప్లాన్ చేయలేదు. ఈ చిత్రాలు ఒకటి తర్వాత మరోకటి విడుదల అవుతున్నాయి. తక్కవ వ్యవధిలోనే చిత్రాల విడుదల అనే అంశం యాక్టర్ చేతిలో ఏమి ఉండదు. అలా జరిగిపోతూ ఉంటాయి. మూడు చిత్రాల్లో మూడు విభిన్న పాత్రలకు ఎంతమందికి లభిస్తాయి చెప్పండి..

 గొప్ప నటిని కాదు.. బ్యాక్ సపోర్ట్ లేదు

గొప్ప నటిని కాదు.. బ్యాక్ సపోర్ట్ లేదు


ఇప్పటివరకు జీవితంలో ఏం సాధించామన్నామనే విషయంపై అంతగా పట్టింపులేదు. చష్మే బద్దూర్ మంచి విజయాన్ని ఇచ్చింది. సహజంగా నటన ఉన్నగొప్ప నటిని కాను. స్టార్‌డమ్ సొంతం చేసుకొనే అర్హత లేదు. ముంబైలో ఉండి అవకాశాల కోసం ప్రయత్నించలేదు. ఎక్కడ అవకాశాలు లభిస్తే అక్కడికి వెళ్లే పనిచేశాను. బాగా డబ్బులున్న డాడీ లేడు. ఎప్పుడూ వెంటఉండి చూసుకునే తల్లి లేదు. అని తాప్సీ చెప్పింది.

 పింక్‌తో మంచి గుర్తింపు వచ్చింది

పింక్‌తో మంచి గుర్తింపు వచ్చింది


బేబీ చిత్రం తర్వాత చాలా యాక్షన్ చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. అయితే నేను తొందరపడలేదు. పింక్ చిత్రంలో విభిన్నమైన పాత్రతో నటిగా మంచి పేరు వచ్చింది. స్వయంకృషితోనే రాణిస్తున్నాను. అదృష్టం వరించడంతో సక్సెస్ సాధిస్తున్నాను తాప్సీ తెలిపింది. ఆమె నటించిన ఘాజీతోపాటు మరో చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరో చిత్రం మార్చిలో రిలీజ్‌కు రెడీ అవుతున్నది.

English summary
Actor Taapsee Pannu, “I never planned the three films Runningshaadi.com, The Ghazi Attack and Naam Shabana to come out one after the other. As an actor, you have no control over when your films will release. she worked for 3 films in 45 days.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu