»   » 'సాహసం' హిట్టయ్యింది: తాప్సీ

'సాహసం' హిట్టయ్యింది: తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Taapsi
హైదరాబాద్ : గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి రూపొందించిన 'సాహసం' ఇటీవల విడుదలై ఇటు ప్రేక్షకుల ఆదరణనీ, అటు విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంటోంది. 'సాహసం' చిత్రంలో తాప్సీ చేసిన శ్రీనిధి పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఈ మధ్య మంచు లక్ష్మీప్రసన్న నిర్మించిన 'గుండెల్లో గోదారి'లో నెగటివ్ టచ్ ఉన్న సరళ పాత్రను చక్కగా పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న ఢిల్లీ సుందరి తాప్సీ తాజాగా అదే తరహా అభినందనలు అందుకుంటోంది.

తాప్సీ మాట్లాడుతూ "చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చింది! తొలి వారాంతానికి 70 శాతం బడ్జెట్ రికవరీ అవడంతో 'సాహసం' హిట్టయ్యిందని సంతోషంగా చెబుతున్నా. దీనికి కారకులైన మీకు థాంక్స్. ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపించానని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో నాకు మేకప్ చేసిన నిక్కీ రజనికీ, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన దివ్య, లిప్సకు థాంక్స్ చెప్పుకుంటున్నా'' అని తెలిపింది.

ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన 'వాలై', లారెన్స్ సరసన 'ముని 3' సినిమాలు చేస్తోంది తాప్సీ . సాహసం విషయానికి వస్తే..గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) ఓ సెక్యురిటీ గార్డ్‌. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు పాకిస్ధాన్ లో ఉన్న ఓ పురాతన దేవాలయం( హింగ్లాజ్ దేవి) సొరంగ మార్గం లోపల నిక్షిప్తమై ఉంటాయి. అయితే అక్కడ ఉన్న నిథి కోసం..అప్పటికే... పాకిస్దాన్ లో ఓ గ్రూప్ (శక్తి కపూర్) తీవ్రంగా ప్రయత్నిస్తూంటుంది. ఆ దేవాలయం దగ్గరకు వెళ్లిన గౌతమ్.. ఆ నిధిని ఎలా బయిటపెట్టాడు...విలన్స్ నుంచి ఎలా ఆ నిధిని రక్షించాడు.. అతనికి శ్రీనిధి (తాప్సి) ఎలా పరిచయం అయ్యింది...ఆమెతో ఉన్న రిలేషన్ ఏమిటి అనేది మిగతా కథ.

English summary
Taapsi says that her latest Film Saahasam is Super hit. And she is very much happy with her Character as Sri Nidhi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu