»   » కోరుకునే మగాడి గురించి...టబు

కోరుకునే మగాడి గురించి...టబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను కోరుకొనే మగాడిలో ఏమేం లక్షణాలుండాలో నాకు మాత్రమే తెలుసు.. అంటోంది టబు. ఆమెని మీరు మగవారి నుంచి ఏం కోరుకుంటారు అన్న దానికి సమాధానంగా..వారిలో అంతగా గొప్ప లక్షణాలు ఉండాలని నేనేమీ కొరుకోను. ఆ విషయం నాకు ఎదురయ్యే మగాళ్లకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సాధారణ మహిళల కంటే నేను ఎక్కువమంది మగాళ్లతో వివిధ కార్యక్రమాల్లో కలుస్తుంటాం. అలాగని కలిసిన వారందరూ మంచివాళ్లే ఉండరు కదా. వారిలో ఉండే లక్షణాలు అన్నీ నచ్చితే జత కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటోంది ఆమె. మీరు పెళ్ళి చేసుకోవటానకి తగ్గ మగవాడు దొరకలేదా అన్న ప్రశ్న మీడియా అడిగినప్పుడు ఇలా స్పందించింది. అలాగే నా కోరికలు, అభిప్రాయాల చిట్టా కాస్త విభిన్నమైనదే అంటూ ముక్తాయింపు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన 'తో బాత్‌ పక్కీ' అనే చిత్రం క్రిందటి వారి రిలీజు అయింది. కామిడీతో నడిచే ఆ చిత్రంలో ఆమె తన చెల్లికి పెళ్లి సంబంధాలు కుదిర్చే పాత్రలో కనిపించింది. డబ్బు పిచ్చితో ఆమె ఈ చిత్రంలో మానవ సంభందాలతో ఆడుకుంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu