పవర్ ఫుల్ లేడీ: టబు లుక్ అదిరింది
హైదరాబాద్: మలయాళంలో మమ్ముట్టి, తెలుగులో వెంకటేష్ 'దృశ్యం'తో విజయం అందుకున్నారు. తహిళంలో ఈచిత్రం కమల్ హాసన్ హీరోగా ‘పాపనాశనం' పేరుతో విడుదలవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. అజయ్ దేవగన్ హిందీలో హీరోగా నటించారు.
ఈ చిత్రానికి సంబందించిన అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలయింది. తెలుగులో కొడుకును పోగొట్టుకున్న పోలీసాఫీసర్ నదియా నటించగా....హిందీలో ఆ పాత్రను ప్రముఖ నటి టబు పోషించారు. టబుపాత్ర పేరు మీరా దేశ్ ముఖ్. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఇందులో అజయ్ దేవగన్ కు జోడీగా శ్రీయ నటించింది. యాక్షన్ చిత్రాలు ఎక్కువగా చేసే అజయ్ దేవగన్, ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించడంతో ప్రేక్షకులలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. హిందీ వెర్షన్ ‘దృశ్యం' చిత్రానికి నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











