»   » హాస్పటల్ పాలైన టబు

హాస్పటల్ పాలైన టబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున కాంబినేషన్ లో నిన్నే పెళ్లాడతా,ఆవిడా మా ఆవిడా వంటి చిత్రాలతో అలరించిన టబు హాస్పటల్ లో చేరి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. టబు నటిస్తున్న'హైదర్'షూటింగ్ లో అస్వస్థతకు గురైంది. హుటాహుటున ఆమెను శ్రీనగర్ హాస్పటల్ కు తరలించారు.

Tabu hospitalized due to breathing problem

శ్రీనగర్ వాతావరణంలో చలి భరించలేక టబు...బోన్ ఫైర్ దగ్గర చలి కాచుకోవడం వెళ్తే అందులోనుంచి వచ్చిన పొగ ఆమెను ఊపిరాడనివ్వకుండా చేసింది. దాంతో ఆమె స్పృహ తప్పింది. హుటాహుటిన ఆమెను హాస్పటల్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రమాదం ఏమీ లేదని చెప్పి, కొన్ని గంటలు అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసారు. ఈ రోజు షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పేశారు. ఈ సినిమాలో షహీద్ కపూర్, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రధారులు .

English summary
Actress Tabu, who is currently shooting for Shahid Kapoor’s Haider in Kashmir, recently fell ill and had to be rushed to a hospital.Tabu was rushed to Srinagar’s Sher-i-Kashmir Institute of Medical Sciences after she complained of breathlessness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu