»   » అఖిల్ అమ్మగా నాగ్ హీరోయిన్.. రెండో ఇన్నింగ్స్ బాలీవుడ్ హీరోయిన్ రెడీ..

అఖిల్ అమ్మగా నాగ్ హీరోయిన్.. రెండో ఇన్నింగ్స్ బాలీవుడ్ హీరోయిన్ రెడీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో నాగార్జున, బాలీవుడ్ నటి టబూ జంటకు గతంలో మంచి క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. అందుకు నిన్నే పెళ్లాడుతా, అవిడా మా ఆవిడే చిత్ర విజయాలు నిదర్శనంగా నిలిచాయి. వెండితెరపై వారిద్దరి కెమిస్ట్రి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టబూ తెలుగు తెరపై మెరువనున్నదనే వార్తలు వెలువడుతున్నాయి. అక్కినేని అఖిల్‌కు అమ్మగా నటిస్తున్నదనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

యాక్షన్ పార్ట్ పూర్తి..

యాక్షన్ పార్ట్ పూర్తి..

ప్రస్తుతం అఖిల్ తాజా చిత్రానికి మనం ఫేం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే యాక్షన్ పార్ట్ పూర్తి చేసుకొన్నది. యాక్షన్ పార్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా సీన్లను చిత్రీకరించాం. ఇందుకోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి స్టంటు మాస్టర్లను రప్పించాం అని అఖిల్ ఇటీవల వెల్లడించారు.

కీలకమైన పాత్రలో టబూ?

కీలకమైన పాత్రలో టబూ?

ఈ చిత్రంలో కీలకమైన తల్లి పాత్ర కోసం గత కొద్దికాలంగా అన్వేషిస్తున్నారట. అయితే పలువురు సీనియర్ హీరోయిన్ల పేర్లను పరిశీలించి.. చివరకు టబూను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఒకవేళ టబూ నటిస్తుందనే వార్త వాస్తవమైతే.. టాలీవుడ్‌కు మరో అమ్మ దొరికినట్టే. దాంతోపాటు టబూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.

 హిట్ కోసం తీవ్ర కసరత్తు

హిట్ కోసం తీవ్ర కసరత్తు

అఖిల్ తొలి చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. అఖిల్ తదుపరి చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో మ‌నం, 24 చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ త‌న‌దైన స్ట‌యిల్లో అఖిల్‌ను స‌రికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

కెరీర్‌పైనే అఖిల్ దృష్టి

కెరీర్‌పైనే అఖిల్ దృష్టి

జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్‌తో అఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రస్తుతం అఖిల్ కెరీర్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. సినీ పరిశ్రమలో తనదైన మార్కును సంపాదించుకొనేందుకు చాలా సీరియస్‌గా రెండో చిత్రంపై కసరత్తు చేస్తున్నారనేది సినీ వర్గాల సమాచారం.

English summary
Tollywood hero Akhil Akkineni's next movie under process. This movie under direction of Manam Fame Vikram Kumar. Reports suggest that senior Actress Tabu playing a mother role for Akhil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu