»   »  ఇంకా కిక్ ఇస్తుంది: అనసూయ చేసిన పాత్రలో టబు ఖరారు

ఇంకా కిక్ ఇస్తుంది: అనసూయ చేసిన పాత్రలో టబు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నేను టబుని మనస్సులో పెట్టుకుని క్షణంలో పోలీస్ పాత్రను డిజైన్ చేసాను... కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరగలేదు అన్నారు అప్పట్లో అడవి శేషు. తెలుగులో మంచి విజయం సాధించిన క్షణం లో అనసూయ చేసిన పాత్ర గురించి చెప్తూ. ఇప్పుడు ఆయన మనస్సులో కోరిక నిజమయ్యే క్షణాలు వచ్చినట్లున్నాయి.

తెలుగులో అనసూయ పోషించిన నెగటివ్ టచ్ ఉన్న పాత్ర కు హిందీ వెర్షన్‌లో తబును ఖరారు చేశారు దర్శక-నిర్మాతలు. అనసూయ పోషించిన పోలీస్ క్యారెక్టర్‌లో అనేక వేరియేషన్స్ ఉండటంతో ఈ పాత్రకు తబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

పైగా హిందీలో టబు పోలీస్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అడివి శేష్ పాత్రను సల్మాన్‌ఖాన్ పోషించే అవకాశం ఉందని ఒక వార్త ముంబయ్‌లో షికారు చేస్తోంది.

Tabu to play cop in Kshanam’s Hindi remake

'దృశ్యం' హిందీ రీమేక్‌లో పోలీస్‌గా నటించిన తబు మరో సారి ఓ సౌత్ రీమేక్‌లో లాఠీ ఝళిపించడానికి సిద్ధమవటం అందరికీ ఆనందం కలిగిస్తోంది. చిన్న సినిమాగా వచ్చి, పెద్ద సినిమా రేంజ్‌లో ఆ మధ్య బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కురిపించిన చిత్రం 'క్షణం'.

సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో నూతన దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ఈ చిత్రానికి నటుడు అడివి శేష్ కథ-స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే.ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి బాలీవుడ్ కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

English summary
"Tabu has given the nod to play the role of the inspector in the Hindi remake of the film. Her character will have multiple shades. the script is being tweaked a little to ensure Tabu has more screen time than Anasuya's character did in the original. In fact, a couple of extra scenes will be added as well.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu