»   » కలకత్తా రెడ్ లైట్ ఏరియా వేశ్య.. టబు

కలకత్తా రెడ్ లైట్ ఏరియా వేశ్య.. టబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలకత్తాలోని 'సోనాగచ్చి' ప్రాంతంలో ఉన్న రెడ్‌లైట్‌ ఏరియాలోని ఓ వేశ్య జీవిత గాధ ఆధారంగా తీస్తున్న చిత్రంలో టబు వేశ్యగా కనిపించనుంది. ఇంతకు ముందు టబు నటించిన హిందీ చిత్రం 'చాందిని బార్‌'లోని 'వేశ్య'గా ఆమె అద్భుత నటనను చూసే ఆమెకీ అవకాశం ఇచ్చారని సమాచారం. దర్శకుడు సుదీప్తో చటోపాధ్యాయ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. రెడ్ లైట్ ఏరియాని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం కథని తయారుచేసి సినిమా రూపొందించబోతున్నారు. ఈ చిత్రదర్శకుడు గతంలో సోనాగచ్చిలోని 'సెక్స్‌ వర్కర్స్‌'పై డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. ఇప్పుడు వారి జీవితాలను వెండితెరపై ఆవిష్కరించాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో టబు వేశ్యగా నటించబోతోంది.ఇక ఈ చిత్రంలో 'దుర్గా పూజ'కి సంబంధించిన సన్నివేశాలు కీలక పాత్ర వహిస్తాయి. నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు టబు కాళికా మాతగా అవతారం ఎత్తి దుష్టుడ్ని శిక్షిస్తుంది. ఈ సినిమాలో మనోజ్‌ బాజ్‌పాయ్‌, రూపా గంగూలీ, ఇంద్రాణి హల్దార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని ఎక్కువ శాతం సోనాగచ్చి ప్రాంతంలోనే జరపాలని ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu