twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇన్నాళ్ళకి నా కల తీరింది : టబు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆంగ్‌ లీ దర్శకత్వంలో నటించడం అనే కల 'లైఫ్‌ ఆఫ్‌ పై'తో తీరింది. 'బ్రోక్‌ బ్యాక్‌ మౌంటైన్‌', 'క్రౌచింగ్‌ టైగర్‌ హిడెన్‌ డ్రాగన్‌', 'హల్క్‌' లాంటి చిత్రాలు తీశారాయన. రాబోయే సినిమాలో భావోద్వేగాల్ని బాగా పండించారు అని టబు మీడియాకు వెల్లడించింది. ఇటీవల ఆమె 'లైఫ్‌ ఆఫ్‌ పై' అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. ఆస్కార్‌ విజేత ఆంగ్‌ లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ నెల 21న చిత్రం తెర మీదికొస్తోంది. టబు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    'లైఫ్ ఆఫ్ పీ' దర్శకుడు ఆంగ్ లీపై బాలీవుడ్ నటి టబు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆయన ఓ అద్భుత దర్శకుడని, ఆస్కార్ అవార్డు పొందిన దర్శకుడి చిత్రంలో తాను నటించడం తన అధృష్టమని పొంగిపోతోంది. కావలసినదేమిటో ఆయనకు కచ్చితంగా తెలుసని, నటీనటుల నుంచి దానిని రాబట్టేందుకు ఏమాత్రం రాజీ పడని వ్యక్తి ఆయనని పొగిడేస్తోంది. సూరజ్‌ శర్మ అనే బాలుడు పై పటేల్‌ పాత్రలో నటించారు. హిందీ తారలు ఇర్ఫాన్‌ ఖాన్‌, టబు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. లైఫ్‌ ఆఫ్‌ పై అనే ఈ చిత్రం ప్రముఖ రచయిత యాన్‌ మార్టెల్‌ రచించిన లైఫ్‌ ఆఫ్‌ పై అనే రచన ఆధారంగా తెరెక్కుతోంది.

    అలాగే ...ఓ సీన్‌ను చిత్రీకరించే ముందు నటీనటులతో రిహార్సల్స్ చేయించి మరీ చిత్రీకరించే దర్శకుడిని తాను తొలిసారిగా చూస్తున్నానని, ఆయన పనితీరు తనకెన్నో పాఠాలు నేర్పిందని చెప్పింది. 'ఆయన చాలా గొప్ప వ్యక్తి. పనిపట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి. కోరుకున్న విధంగా సీన్ వచ్చేవరకు ఎవరినీ వదిలిపెట్టరు. ప్రత్యేకించి ఎమోషన్ సీన్లలో ఆయన కచ్చితత్వం ఎంతగానో ఆకట్టుకుంది. నటీనటులను ప్రోత్సహించి, వారిలోనుంచి తనకు కావాల్సింది రాబట్టుకునే అద్భుత నైపుణ్యం లీ సొంతమని' చెప్పింది.

    ఆస్కార్‌ పురస్కార విజేత ఆంగ్‌ లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లైఫ్‌ ఆఫ్‌ పై'. గోవాలో నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో ప్రారంభ చిత్రంగా దీన్ని ప్రదర్శించబోతున్నారు. పదకొండేళ్ల కిందట యాన్‌ మార్టెల్‌ రాసిన నవల దీనికి ఆధారం. సుమారు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి ప్రపంచ నలుమూలల నుండి మంచి స్పందన వస్తోంది. నవంబరు 21న ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికంటే మూడు రోజుల ముందు ఇఫీలో ప్రదర్శితమవుతుంది.

    చిత్రం కథ ఏమిటంటే - సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక పెద్ద షిప్ మునిగిపోగా అందులో నుంచి బతికిన పై అనే 16 సంవత్సరాల యువకుడు అక్కడి నుండి ఒక చిన్న పడవలో పై తో పాటు ఒక బెంగాల్ టైగర్, ఒక కోతి, ఒక జీబ్రా మరియు ఒక హైనాలతో అతని జర్నీ ఎలా సాగింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. పాండిచ్చేరికి చెందిన పై పటేల్‌ అనే అబ్బాయి, రిచర్డ్‌ పార్కర్‌ అనే పులితో కలిసి దాదాపు 227 రోజులు పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణించాల్సి వస్తుంది. సాహసోపేత ప్రయాణమే ఈ చిత్రం.

    English summary
    
 Actor Tabu, who will be seen in Ang Lee's Life Of Pi says the Oscar winning director is very clear about what he wants and is extremely particular about every scene. "He is a great person. He is very particular about his scenes and he does not let you go till a shot comes across. He is very clear that if a character is going through some emotion, he wants it to be portrayed in exactly the same way. Whatever you do, but bring it out. Until and unless he doesn't get it, he will keep pushing you," Tabu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X