For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'తడాఖా' ఆడియోలో బెల్లంకొండ ఓపెన్ ఛాలెంజ్ (ఫోటోలతో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం 'తడాఖా'. సునీల్‌ మరో హీరో. తమన్నా, ఆండ్రియా హీరోయిన్. కిషోర్‌ పార్థాసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

  బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. నాగార్జున స్వీకరించారు. ఈ వేడక చాలా ఘనంగా జరిగింది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని వేడుకకు వచ్చిన వారంతా ఆకాంక్షించారు. . ఈ సినిమా విజయం సాధించకపోతే అభిమానులు నా కార్యాలయానికి రావొచ్చు అని ఓపెన్ ఛాలెండ్ చేసారు బెల్లంకొండ సురేష్‌.

  నాగార్జున చాలా ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, మారుతి, రేష్మ, నల్లమలుపు బుజ్జి, రామజోగయ్యశాస్త్రి, సంతోష్‌ శ్రీనివాస్‌, వాసువర్మ, ఎమ్‌.ఎల్‌. కుమార్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

  ఆడియో విడుదల విశేషాలు స్లైడ్ షో లో...

  ఆడియో వేడుక చాలా ఘనంగా బెల్లంకొండ చేసారు

  నాగార్జున ప్రత్యేక అతిథి కావటం ఈ పంక్షన్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  నాగార్జున మాట్లాడుతూ...యేడాది కాలంగా అన్నీ బాగున్నాయి కానీ... ఏదో వెలితి. నాగచైతన్యకి విజయం దక్కలేదనే బాధ. ఇక మంచి సినిమా నేనే తీయాలనే ఆలోచన వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బెల్లంకొండ సురేష్‌ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.


  'వేట్త్టె' అనే తమిళ సినిమాను చైతన్యతో రీమేక్‌ చేస్తామని నా దగ్గరికి వచ్చారు. తప్పకుండా చైతన్యకి సరిపోతుంది. విజయం వస్తుందని అప్పుడే నమ్మాను అన్నారు అక్కినేని నాగార్జున.

  అలాగే ''ఇందులో సోదరుడు పాత్రకు ఎవరైతే బాగుంటుందా అని ఆలోచించాం. సునీల్‌ అయితే బాగుంటుందని భావించాం. సునీల్‌ అంటే నాకు చాలా ఇష్టం. తను కష్టపడి పైకొచ్చాడు. సెట్‌లో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. తడాఖా ప్రచార చిత్రాలు చూడగానే దర్శకుడి ప్రతిభేమిటో అర్థమైంది. తమన్నా కనబడినప్పుడల్లా 'ఎంత అందంగా ఉన్నావు తమన్నా' అంటుంటాను. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి నటిస్తామేమో. 'గ్రీకువీరుడు'కీ, ఈ సినిమాకీ తమన్‌ మంచి సంగీతం అందించాడు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఆ తర్వాత నాగచైతన్య గురించి మరింత మాట్లాడతాను'' అన్నారు.

  అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ''హాస్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను అడిగి మరీ 'మిస్సమ్మ'లో వినోదం చేశాను. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు వినోదం పండించే హీరో. మరొకరు రొమాంటిక్‌ హీరో. వినోదం, శృంగారం రెండూ కలిస్తే చాలా బాగుంటుంది. ఏ కుటుంబమైతే నేను సినీ రంగంలోకి రావడానికి దోహదపడిందో ఆ కుటుంబానికి చెందినవాడు తమన్‌. తను ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంది''అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా తీశాక నేను మాస్‌ సినిమా తీయగలనా అని భయంగా ఉండేది. బెల్లంకొండ సురేష్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సినిమా చేయగలిగాను. నాగచైతన్య ఈ సినిమాతో పెద్ద మాస్‌ హీరో అవుతాడు'' అన్నారు.

  సునీల్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో చైతన్య ఫైట్స్‌ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆయన ఇంతగా చేయగలడని నేను అస్సలు వూహించలేదు. గతంలో 'జోష్‌' సినిమాలో ఆయనకి స్నేహితుడిగా నటించాను. ఇందులో అన్నయ్యగా నటించాను. అప్పుడు ఎలా ఉన్నారో... ఇప్పుడూ అలాగే ఉన్నారు'' అన్నారు.

  నాగచైతన్య మాట్లాడుతూ ''వేట్త్టె చూసినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలనుకొన్నాను. 'తడాఖా' పక్కా కమర్షియల్‌ సినిమా. ఎవరూ నిరాశ చెందరు. అందరూ ఆస్వాదించేలా ఉంటుందీ సినిమా'' అన్నారు.

  ''కిషోర్‌తోనూ, నాగచైతన్యతోనూ నాకు ఇది రెండో సినిమా. ఈ సినిమాలో నటిస్తున్నంతసేపు కుటుంబంతో గడుపుతున్నట్టే అనిపించింది''అని తెలిపింది తమన్నా.

  ''ఈ సినిమాలో నాగచైతన్య తడాఖా చూపిస్తాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇదే వేదికపై వంద రోజుల వేడుక జరుపుతాను. సునీల్‌ హీరోగా మారిన ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం సాధించకపోతే అభిమానులు నా కార్యాలయానికి రావొచ్చు'' అన్నారు బెల్లంకొండ సురేష్‌.

  తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో ‘వెట్టై' చిత్రం రూపొందగా, దానికి రీమేక్‌గా ‘తడాఖా' చిత్రం డాలి దర్శకత్వంలో రూపొందుతోంది.

  ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు.

  సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్‌ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్‌, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్‌, పాటలు: చంద్రబోస్‌, సంగీతం: తమన్‌, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).

  English summary
  The audio launch function of Tadakha movie is a sparkling event with glamor and glitterati rising to the core. Music scored by Thaman has once again energized the whole event. Including hero Naga Chaitanya and heroine Tamanna Bhatia many celebs including legendary Akkineni Nageswara Rao, romantic hero Nagarjuna, six-pack hero Sunil, producer Bellamkonda Suresh and director Dolly, many stars attended the event to make it a memorable audio launch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X