»   » తాగుబోతు రమేష్... వెడ్డింగ్ ఇన్విటేషన్ (ఫోటోస్)

తాగుబోతు రమేష్... వెడ్డింగ్ ఇన్విటేషన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు కమెడియన్ తాగుబోతు రమేష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిజామాబాద్ జిల్లా ...భిక్కనూర్ రైల్వేస్టేషన్ గ్రామానికి చెందిన చెందిన స్వాతితో రమేష్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

Tagubothu Ramesh wedding invitation

ఈ నెల 28 కామారెడ్డిలో వివాహం జరుగబోతోంది. అనంతరం 30వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. తాజాగా తాగు బోతు రమేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వివరాలు మీడియాకు విడుదల చేసారు.

తాగుబోతు రమేష్ గురించిన వివరాల్లోకి వెళితే...
తాగుబోతు రమేష్ 2005లో 'జగడం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించాడు. మహాత్మ, భీమిలి కబడ్డీ జట్టు, ఈ వయసులో చిత్రాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాలు రమేష్‌కు పెద్దగా గుర్తింపు తేలేదు. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా మొదలైంది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో రామేష్ పోషించిన తాగుబోతు పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తాగుబోతు రమేష్‌గా పాపులరయ్యాడు.

Tagubothu Ramesh wedding invitation

రమేష్‌ది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తండ్రి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడు. ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి చూసిన రమేష్.......తాగుబోతులను ఇమిటేట్ చేయడం ప్రాక్టీస్ చేసే వాడు. నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు.

English summary
Tollywood actor Tagubothu Ramesh wedding invitation.
Please Wait while comments are loading...