»   » తైవాన్ భాషలో ప్రభాస్ చేసిన వీడియో హల్ చల్ ...

తైవాన్ భాషలో ప్రభాస్ చేసిన వీడియో హల్ చల్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమాతో దేశాలు దాటి మరీ వ్యాప్తంగా పాపులరిటీ తెచ్చుకున్న యంగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పిచ్చి ఆనందం తో సంబరాలు చేసుకుంటున్నారు...మళ్ళీ బాహుబలి పెద్ద అవార్దు ఏం సాధించలేదు,కొత్త రికార్డేదీ బద్దలు కొట్టలేదు అయినా రెబెల్ భక్తులంతా ఆనందం లో మునిగిపోయారు...

ఎందుకంటే...ట్విట్టర్ లో ప్రభాస్ ఫాన్స్ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 5 లక్షలకు చేరిందట. ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఈ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తమ ట్విట్టర్ అభిమానులు సంఖ్య హాఫ్ మిలియన్ కు చేరిందంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఫ్యాన్స్ ఖాతా కే ఇంతఫాలోయింగ్ ఉంటే.. స్వయంగా తమ హీరో ట్విట్టర్ లోకి వస్తే ఇంకెంత క్రేజ్ ఉంటుందో నని సోషల్ మీడియా అంతా హోరెత్తిస్తున్నారు.

Taiwan is Next Destination of

ఇదిలా ఉంటే రోజులు గడుస్తున్నా తెలుగు చిత్రసీమలోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన బాహుబలి (ది బిగినింగ్) విదేశాల్లో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే పలు విదేశీ భాషల్లో విడుదలైన ఆ సినిమాను తాజాగా తూర్పు చైనాకు 180 కిలో మీటర్ల దూరంలోని తైవాన్ దీవిలో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఓ చిన్న ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ స్థానిక భాషలో మాట్లాడుతూ ఇప్పుడు తైవాన్ లో కూడా బాహుబలి విడుదలవుతుంది. తప్పక చూడండి అంటూ చెప్పారు.

చిన్నచిన్నపట్టణాలతో ఉన్న తైవాన్ లో రిసార్ట్స్, చక్కటి అవరోహణకు అనుకూలంగా ఉన్న పర్వతాలు.. ఎప్పుడు రద్దీగా ఉండే పండ్ల మార్కెట్లు ఎక్కువ. అంతే కాకుండా విడుదలైన ప్రతి చోట్ల రికార్డుల కలెక్షన్లు వసూలు చేసిన ఈ ఇండియన్ లార్జెస్ట్ ఎపిక్ ఈ మధ్యే జెర్మనీలో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత ఇక్కడే అడుగు పెడుతున్నాడు.మరి ఈ బాహుబలి తైఫీయన్లను ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి..

English summary
A short video of Prabhas informing the release of Bahubali in Taiwan has been released by the filmmakers on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu