»   » మీరు నటించగలరా... చాన్స్ మేమిస్తాం అంటూ : రవీంద్ర భారతి లో టాలెంట్ హంట్ వివరాలివే

మీరు నటించగలరా... చాన్స్ మేమిస్తాం అంటూ : రవీంద్ర భారతి లో టాలెంట్ హంట్ వివరాలివే

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ దర్శకుడు ఎన్నెన్జీ ఫ్రెండ్స్ ఫండింగ్ ఫీచర్ ఫిలిం అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమా నిర్మించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన టీమ్ తో కలిసి ఇంకో కొత్త ప్రయోగం మొదలు పెట్టాడు. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తో కలిసి కొత్త పద్దతిలో 'టాలెంట్ హంట్" చేస్తున్నాడు. తన టీమ్ మెంబర్లతో కలిసి తన సినిమా కోసం కావాల్సిన నటులని కొత్త వాళ్లనుంచి తానే ఎంపిక చేసుకుంటున్నాడు. అంతే కాదు వచ్చే నటులకి భవిశ్యత్ లోనూ అవకాశాలు రావటానికి వీలుగా "టాలెంట్ బాక్స్" అనే ఇంకో ప్రయోగమూ చేస్తున్నాడు. ఆ వివరాలు...

"యాక్ట్ .. యాక్టింగ్ ... & యాక్టర్ .."

నటన లో ఆరితేరిన నటుడుఇకైనా కొన్నిసార్లు కష్టం ఉంటే సరిపోదు మనదగ్గరున్న టాలెంట్ కి కావాల్సింది ఒక్క చాన్స్..! అయితే ఆ ఒక్క చాన్స్ కోసం ఎన్నో మెట్లు ఎక్కాల్సుంటుంది అయితే ఈసారి మాత్ర రవీంధ్ర భారతి మెట్లెక్కితే చాలు. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యం లో నిర్వహించే 'సినివారం' తో యెన్నెన్జీ మోషన్ పిక్చర్స్ 'హృదయాంజలి" ఫీచర్ ఫిలిం సంయుక్తంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు. యాక్టింగ్ టాలెంట్ హంట్ "యాక్ట్ .. యాక్టింగ్ ... & యాక్టర్ .." (AAA) గా పిలుస్తున్న ఈ ప్రోగ్రాం లో నటీనటుల ఎంపిక జరుగనుంది.

2017 మే 5, 6 & 7 తేదీల్లో

2017 మే 5, 6 & 7 తేదీల్లో

తెలంగాణ లో ఉన్న ఔత్సాహిక ​యా​క్టర్స్ ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం రవీంద్ర భారతి లోని మొదటి అంతస్థు మినీ హాల్ లో ఈ నెల అంటే 2017 మే 5, 6 & 7 తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు నిర్వహిస్తున్నారు.

టాలెంట్ హంట్

టాలెంట్ హంట్

ఈ కార్యక్రమం లో ఆడిషన్ ఇచ్ఛే కళాకారుల డేటా ని భద్రపరిచి ఒక టాలెంట్ బ్యాంకు ని తయారుచేసి ఫిలిం మేకర్స్ అందరికి ​అందుబాటులో ఉంచేలా చేయటం కోసమే ఈ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్టు దర్శకుడు ఎన్నెంజీ (Yennengee) చెప్పారు. అలాగే ఈ ఇందులో పాల్గొన్న వారిలో కొంతమందికి ఫ్రెండ్స్ ఫండింగ్ కాన్సెప్ట్ లో వస్తున్న త్రిభాషా చిత్రం "హృదయాంజలి" లో లో అవకాశం ఇస్తారట.

ఫిలిం మేకర్స్ కూడా

ఫిలిం మేకర్స్ కూడా

ఇంతే కాదు సినివారం లో పాల్గొనే ఇతర ఫిలిం మేకర్స్ కూడా తమ తమ సినిమాల్లో ఈ టాలెంట్ హంట్ కి వచ్చిన కళాకారులని తమ ప్రాజెక్టుల్లోకి తీసుకునే అవకాశమూ ఉంది. షార్ట్ ఫిలిమ్, నాటకం, సినిమా, మ్యూజిక్ ఆల్బం ఇలా ఏ అవసరానికైనా మీరిచ్చే వివరాల డేటాని బట్టి మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుందన్న మాట. అందులోనూ ఇది ఒక్కరోజులో అయిపోయేది కాదు. మీ మీ వివరాలు దర్శకులకి అందుబాటులో ఉంచబడతాయి.

ఎంట్రీ ఫీజులు లేవు

ఎంట్రీ ఫీజులు లేవు

దీనికి గానూ ఎలాంటి ఎంట్రీ ఫీజులు కూడా లేవు, కావాల్సిందల్లా మీ ఫోటో మరియు ఆధార్ కార్డు​/ఏదైనా ఐడీ ప్రూఫ్ ​ జిరాక్స్ కాపీ తో మీరు రవీంద్ర భారతి కి వఛ్చి అక్కడ నిర్వాహకులు ఇచ్చే ఆడిషన్ ఫారం ని నింపి 2-3 నిమిషాలకు ఎక్కువ కాకుండా ఏదైనా మీకిష్టం వఛ్చిన ఒక ఆక్ట్ ని ప్రదర్శిస్తే చాలు.

టాలెంట్ బ్యాంక్

టాలెంట్ బ్యాంక్

ఇలా ఎంట్రీ అయిన ప్రతీ వ్యక్తి వివరాలు ఫోటోలు, వీడియో​లు ​ తీసి టాలెంట్ బ్యాంక్ లో ఎంటర్ చేస్తారు . దీనివల్ల ఎప్పుడైనా వేరే సినీ ప్రాజెక్టుల్లో అవసరం వచ్చినప్పుడు ఆయా నటులనే డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యే చాన్సుందన్న మాట. ఈ టాలెంట్ బ్యాంకు ప్రతి ఫిలిమ్ మేకర్ కి అందుబాటులో ఉంటుంది , దీనికి కూడా ఎలాంటి ఫీజూ వసూలు చేయరు.

actactingactor@gmail.com

actactingactor@gmail.com

ఇందులో పాల్గొనే వారికి ఎలాంటి ​వయసు​ నిబంధనలు లేవు కాకపోతే 18 సంవత్సరాలకు తక్కువగా ఉన్న వారు పేరెంట్స్/గార్డియన్స్ తో రావాల్సి ఉంటుంది. ఎలాంటి లింగ​​బేధాలు లేవు కాబట్టి ఎవరైనా ​ పాల్గొనవచ్చు ​. మిగతా వివరాలకు 99123 76894 కి వాట్సాప్ లేదా actactingactor@gmail.com కి మెయిల్ చేయవచ్చు . ఇంకెందుకు ఆలస్యం ట్రై యువర్ లక్.

English summary
"Talent Hunt For Actors program "Act, Acting & Actor" Will be on May 5,6 & 7 in Ravindra Bharati" sais Hrudayanjali director Yennengee (NNG)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu