»   » ఒక్క చాన్స్ కోసం, ఇంకా ఒక్క రోజే : "హృదయాంజలి టాలెంట్ హంట్" పోస్టర్

ఒక్క చాన్స్ కోసం, ఇంకా ఒక్క రోజే : "హృదయాంజలి టాలెంట్ హంట్" పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ దర్శకుడు ఎన్నెన్జీ ఫ్రెండ్స్ ఫండింగ్ ఫీచర్ ఫిలిం అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తో సినిమా నిర్మించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన టీమ్ తో కలిసి ఇంకో కొత్త ప్రయోగం మొదలు పెట్టాడు. తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తో కలిసి కొత్త పద్దతిలో 'టాలెంట్ హంట్" చేస్తున్నాడు.

టాలెంట్ బాక్స్

టాలెంట్ బాక్స్

తన టీమ్ మెంబర్లతో కలిసి తన సినిమా కోసం కావాల్సిన నటులని కొత్త వాళ్లనుంచి తానే ఎంపిక చేసుకుంటున్నాడు. అంతే కాదు వచ్చే నటులకి భవిశ్యత్ లోనూ అవకాశాలు రావటానికి వీలుగా "టాలెంట్ బాంక్" అనే ఇంకో ప్రయోగమూ చేస్తున్నాడు. కార్యక్రమం లో ఆడిషన్ ఇచ్ఛే కళాకారుల డేటా ని భద్రపరరుస్తారు.

అవకాశం ఇస్తారు

అవకాశం ఇస్తారు

ఆ వివరాలతో ఒక టాలెంట్ బ్యాంకు ని తయారుచేసి ఫిలిం మేకర్స్ అందరికి ​అందుబాటులో ఉంచేలా చేయటం కోసమే ఈ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్టు దర్శకుడు ఎన్నెంజీ చెప్పారు. అలాగే ఈ ఇందులో పాల్గొన్న వారిలో కొంతమందికి ఫ్రెండ్స్ ఫండింగ్ కాన్సెప్ట్ లో వస్తున్న త్రిభాషా చిత్రం "హృదయాంజలి" లో లో అవకాశం ఇస్తారట.

"యాక్ట్ .. యాక్టింగ్ ... & యాక్టర్ .."

తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యం లో నిర్వహించే 'సినివారం' తో యెన్నెన్జీ మోషన్ పిక్చర్స్ 'హృదయాంజలి" ఫీచర్ ఫిలిం సంయుక్తంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు. యాక్టింగ్ టాలెంట్ హంట్ "యాక్ట్ .. యాక్టింగ్ ... & యాక్టర్ .." (AAA) గా పిలుస్తున్న ఈ ప్రోగ్రాం లో నటీనటుల ఎంపిక జరుగనుంది.

యా​క్టర్స్ ని పరిచయం చేయాలన్న ఉద్దేశ్యం తో

యా​క్టర్స్ ని పరిచయం చేయాలన్న ఉద్దేశ్యం తో

తెలంగాణ లో ఉన్న ఔత్సాహిక ​యా​క్టర్స్ ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం రవీంద్ర భారతి లోని మొదటి అంతస్థు మినీ హాల్ లో ఈ నెల అంటే 2017 మే 5, 6 & 7 తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు నిర్వహిస్తున్నారు.

ఒక గుర్తింపు కార్డుతో జిరాక్స్ తో

ఒక గుర్తింపు కార్డుతో జిరాక్స్ తో

ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో జిరాక్స్ తో రవీంద్రభారతికి హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9912376894 కి కాల్ చేయవచ్చు. ఈ కార్యక్రమ పోస్టర్ ని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హృదయాంజలి దర్శకుడు యెన్నెన్జీ , ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సోనియా ఆకుల , ఆడిషన్ డైరెక్టర్ వీజే గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Talent Hunt For Actors program "Act, Acting & Actor" Will be on May 5,6 & 7 in Ravindra Bharati" sais Hrudayanjali director Yennengee (NNG)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu