»   » ఇకపై ఇలాంటివి చేయను: ‘అభినేత్రి’ మూవీపై తమన్నా కామెంట్!

ఇకపై ఇలాంటివి చేయను: ‘అభినేత్రి’ మూవీపై తమన్నా కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదలవుతుంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా తమన్నా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా గురించి తమన్నా మాట్లాడుతూ.... మూడు భాషల్లో ఒక సినిమాను చేయడమంటే ఎంత కష్టమో తెలిసింది. ఇకపై ఇలాంటివి చేయను అని తమన్నా చెప్పుకొచ్చారు.


మూడు బాషల్లో సినిమా అంటే..కంటిన్యూగా వర్క్‌ చేయాల్సి ఉంటుంది. మూడు భాషల్లో మూడు రకాల లిప్‌ మూమెంట్స్‌తో డైలాగ్స్‌ చెప్పడం, మూడు భాషల లిప్‌ మూమెంట్స్‌కు తగిన విధంగా డ్యాన్స్‌ మూమెంట్స్‌లో చిన్న వేరియేషన్స్‌తో మళ్లీ చేయడం, ఇలాంటివి గ్యాప్ లేకుండా చేయడం వల్ల అంతా చాలా అలసి పోయామని తమన్నా తెలిపారు.


రక్తం, దెయ్యం రెండూ కనిపించవు

రక్తం, దెయ్యం రెండూ కనిపించవు

అభినేత్రి` హర్రర్‌ కామెడి జోనర్‌ మూవీ అని అంటున్నారు కానీ ఇది ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టే సినిమా మాత్రం కాదు. సినిమాలో ఎక్కడా రక్తం ఉండదు. దెయ్యం ఉంటుంది కానీ కనపడదు అని తమనప్నా చెప్పుకొచ్చారు.


బాహుబలి తర్వాత నేను కొత్తగా

బాహుబలి తర్వాత నేను కొత్తగా

బాహుబలి వంటి సినిమా తర్వాత ఆడియెన్స్‌ నన్ను కొత్తగానే చూడాలనుకుంటున్నారు. అందుకే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకున్నాను. ఆ సమయంలో అభినేత్రి కథ వినడం, నచ్చడంతో అంగీకరించడం జరిగింది అని తమన్నా తెలిపారు.


డబల్ రోల్ చేసాను

డబల్ రోల్ చేసాను

అభినేత్రిలో కొత్త తమన్నాను ఈ సినిమాలో చూస్తారు. దేవి, రూబీ అనే డ్యూయెల్‌ రోల్‌ చేశాను. సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి, అందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు.


ప్రభుదేవాతో కలిసి చేయడంపై

ప్రభుదేవాతో కలిసి చేయడంపై

ప్రభుదేవాగారు చూడటానికి చాలా సింపుల్‌గానే కనపడతారు కానీ ఆయనలో చాలా సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ ఉంది. కెమెరా ముందుకు వచ్చేసరికి ఆయనే వేరేలా ఉంటారు. సినిమాలో ఆయన వచ్చిన తర్వాత మరిత ఆసక్తికరంగా ఉంటుంది అని తమన్నా చెప్పారు.


తేడా వస్తుందనే చెప్పలేదు

తేడా వస్తుందనే చెప్పలేదు

'ఊపిరి' సినిమాలో నేను డబ్బింగ్ చెప్పిన మాట నిజమే. ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌కు నా వాయిస్ సరిపోయింది. ఈ సినిమా విషయానికి వస్తే దేవి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర. ఆ యాసలో నేను డబ్బింగ్ చెప్పలేను. సెట్‌ కాకపోతే ఇబ్బంది అవుతుందనే చెప్పలేదన్నారు తమన్నా.


స్పెషల్ సాంగులు అందరూ చేస్తున్నారు

స్పెషల్ సాంగులు అందరూ చేస్తున్నారు

హీరోయిన్స్‌ స్పెషల్‌ సాంగ్స్‌ చేయడమనే సంస్కృతి బాలీవుడ్‌లో ఎక్కువగాఉంది. కరీనాకపూర్‌, ప్రియాంకచోప్రా, దీపికా వంటిస్టార్‌ హీరోయిన్స్‌ కూడా స్పెషల్‌సాంగ్స్‌లో నటించారు. ఇపుడు సౌత్ లో కూడా ఈ కల్చర్ వచ్చింది. స్పెషల్‌సాంగ్‌ను ఎబ్బెట్టుగా కాకుండా అందంగా చూపిస్తారు. బావుంటుందనిపిస్తే ఎవరైనా చేయవచ్చు. అందుకే నేను స్పెషల్‌సాంగ్స్‌ చేస్తున్నాను అని తమన్నా తెలిపారు.


English summary
Check out Tamanna interview about Abhinetri movie. Abhinetri is an upcoming Indian horror comedy film co-written and directed by A. L. Vijay. It features Prabhu Deva, Tamannaah and Sonu Sood in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu