»   »  ఎఫైర్ లేదు... అన్నయ్యే, రాఖీ కూడా కట్టాను!

ఎఫైర్ లేదు... అన్నయ్యే, రాఖీ కూడా కట్టాను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుంటోంది. మొదటి సినిమా 'హిమ్మత్ వాలా' అజయ్ దేవగన్ తో నటించిన తమన్నా పరాజయం చవి చూడక తప్పలేదు. ప్రస్తుతం ఆమె సాజిద్ ఖాన్ దర్శకత్వంలో 'హమ్ షకల్స్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె సైఫ్ అలీ ఖాన్‌‌కు జోడీగా నటిస్తోంది.

Tamanna about director Sajid Khan

ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్న విషయం ఏమిటంటే ఈ అమ్మడు సాజిద్ ఖాన్ తో ప్రేమలో పడిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ మధ్య ఆమె దర్శకుడితో కలిసి లిప్టులో రొమాన్స్ చేసిందనే అంశం హాట్ టాప్ అయింది. ఇంతకీ తమన్నా, సాజిద్ ఖాన్ మధ్య ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడానికి మరో కారణం కూడా ఉంది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు బాలీవుడ్ భామలు బిపాసా బసు, ఇషా గుప్తా కూడా నటిస్తున్నారు. దర్శకుడు మిగిలిన ఇద్దరు బాలీవుడ్ భామలకంటే తమన్నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, 'హమ్‌షకల్స్' సినిమా ప్రమోషన్లకు కూడా తమన్నానే ఎంచుకోవడం లాంటివి చేసాడు. ఓ సీన్లు తమన్నా బికినీ వేయాల్సి ఉండగా....ఆమెకు ఇష్టం లేక పోవడంతో మినహాయింపు ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు భామలతో మాత్రం పట్టుబట్టి బికినీ వేయించి మరీ సీన్లు చిత్రీకరించారు.

అయితే ఈ వార్తలను తమన్నా ఖండిస్తోంది. తమ మధ్య అలాంటి వార్తలు ప్రచారంలోకి రావడం విచారకరమని, సాజిద్ ఖాన్ తనకు అన్నయ్య లాంటి వాడని, నేను రాఖీ కూడా కట్టాను. రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. ఓ యాక్టర్ ను డైరెక్టర్ నమ్మితే.. సంబంధాలను అంటగడుతారా? అంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు.

English summary
Tamanna is one of the most beautiful actresses in the country. Bollywood circles were buzzing with reports about a relationship with director Sajid Khan and the two of them were spotted together often. But now Tamanna shocked everyone by saying that Sajid is like a brother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu