»   » తీరికుంటే అలా తృప్తి పడతాను...తమన్నా

తీరికుంటే అలా తృప్తి పడతాను...తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమన్నా తనకో విచిత్రమైన అలవాటు ఉందంటోంది. అదేంటి అంటే...పగటి కలలు కనటం అంటోంది. ప్రపంచంలో అందరూ చేసేదిగా అంటే ఆమె అందరిలా కాకుండా తాను అసాధ్యం అనుకున్నవాటిని కల కని తప్తిపడతానని చెప్తోంది.ఆమె మాటల్లోనే...మనం సుసాధ్యం చేసుకోగల విషయాల గురించి కలలు కనక్కర్లేదు. కానీ ఏవైతే చేయలేమో అవి నెరవేర్చు కున్నట్లుగా కల కనేశామనుకోండి..ఓ రకమైన సంతృప్తి లభిస్తుంది ఆ రకంగా ఏ కోరికనైనా తీర్చుకుంటాను అంటోందామె. ఇక తీరిక దొరికనప్పుడు హాయిగా కునుకు తీస్తాను. ఐదారు గంటలు, మహా అయితే ఇంకో గంట అదనంగా...అంతకుమించి ఈ మధ్య ఎక్కువసేపు నిద్రపోవడానికి కుదరడంలేదు. అందుకే ఖాళీ దొరికితే ఏకధాటిగా 10 గంటలైనా నిద్రపోవాలని అనుకుంటున్నాను అని చెప్తోంది. ఇక తీరిక వేళల్లో బాగా నిద్రపోయిన తర్వాత ఇంకా సమయం ఉంటే అప్పుడు కాగితం, కలంతో తీసుకుని కవితలు రాస్తుందిట. అలాగే ఎవరైనా మంచి మాటలు చెబితే, అవి కూడా ఓ పుస్తకంలో రాసుకుంటానని చెప్తోంది. ప్రస్తుతం తమన్నా నాగచైతన్య సరసన సుకుమార్ దర్శకత్వంలోనూ, అల్లు అర్జున్ సరసన వివివినాయిక్ దర్శకత్వంలోనూ చేయటానికి కమిటయ్యింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu