»   » ఫొటో: బాహుబలిలో మరో నాయిక తమన్నా

ఫొటో: బాహుబలిలో మరో నాయిక తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి సినిమాలో హీరోయిన్‌గా అందాల తార తమన్నా హీరోయిన్‌గా నటించబోతోంది. తమన్నా పుట్టిన రోజు డిసెంబర్ 21. దీంతో బాహుబలిలో ఓ హిరోయిన్‌గా తమన్నా నటించబోతున్నట్లు నిర్మాతలు శుక్రవారంనాడు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధిచిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్ వీడియో, అనుష్క పుట్టినరోజు సందర్బంగా బిహైండ్ సీన్స్, రానా పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. అవి సంచలనం సృష్టించాయి.

ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా నిర్మితమవుతోంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్త ఈ బారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల జాబితాలో బాహుబలి కూడా చేరబోతోంది.

ఇప్పటి వరకు తమ బాహుబలి చిత్రానికి సంబంధించి విడుదల చేసిన వీడియోలకు అద్భతమైన స్పందన వచ్చిందని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని వివరించారు. ప్రభాస్ ఈ చిత్రంలో బాహుబలిగా, శివుడిగా రెండు పాత్రలు పోషిస్తున్నాడు. బాహుబలి సరసన అనుసక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివుడి సరసన తమన్నా నటిస్తుందని నిర్మాతలు చెప్పారు.

ప్రస్తుతం బాహుబలి చిత్రానికి సంబంధించిన ఓ భారీ యుద్ధసన్నివేశాన్ని డిసెంబర్ 23 నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభిస్తున్నామని, మార్చి 5వతేదీ వరకు రామోజీ ఫిలిం సిటీలోనే ఈ షెడ్యూల్ జరుగతుందని వారు చెప్పారు.

English summary
Tamanna will be the another heroine in Prabhas and Anushka starred Bahubali film. SS Rajamouli is directing the film,. Rana is another star acting in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu