»   » తెల్లగా ఉన్నావని పొగరా? తమన్నాపై అభిమాని ఆగ్రహం: తమన్నా సమధానం ఏమిటంటే

తెల్లగా ఉన్నావని పొగరా? తమన్నాపై అభిమాని ఆగ్రహం: తమన్నా సమధానం ఏమిటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేయడం ఎంతటి సెలబ్రిటీకైనా చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. ఆ క్రమంలోనే 'మిల్కీ బ్యూటీ' తమన్నా తన ఫ్యాన్స్ తో ముచ్చటించే కార్యక్రమం పెట్టుకుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత తమ అభిమాన తారలతో నేరుగా మాట్లాడే అవకాశం అభిమానులకు కలుగుతోంది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో లైవ్ ఛాట్ తో ఆకట్టుకుంటూ ఆయా తారలు తమ అభిమానులను మరింత అలరిస్తున్నారు. ఈ క్రమంలో సినీనటి తమన్నా అభిమాలనులతో లైవ్ ఛాట్ నిర్వహించింది.

అందులో ఒక అభిమాని ''తెల్లగా ఉన్నావని పొగరా? నాకెందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటూ కోపంతో తమన్నాను ప్రశ్నించాడు. అయితే దీనిని లైట్ తీసుకున్న తమన్నా "అయ్యో... పొగరు కాదండి. మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'' అంటూ సమాధానం చెప్పింది.

Tamanna Bhatia Gets Irritated By A Fan

అనంతరం తాను చేస్తున్న, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి అభిమానులకు వివరించింది. ఆ సందర్భంగానే ''సినిమాలు లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందే సినిమాలో నటించాలనేది నా డ్రీమ్‌'' అంటూ వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకున్నారు.

English summary
Tamanna Bhatia Gets Irritated By A Fan in a Social media live chat
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu