»   » గళ్ళ లుంగీ మోకాళ్ళ దాకా ఎగ్గట్టి.... ఎయిర్ పోర్ట్ లో తమన్నా డ్రెస్

గళ్ళ లుంగీ మోకాళ్ళ దాకా ఎగ్గట్టి.... ఎయిర్ పోర్ట్ లో తమన్నా డ్రెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిల్కీ బ్యూటీ తమన్నా లుంగీ కట్టేసింది... ఏ సినిమాలో మాంచి మసాలా స్పెషల్ సాంగ్ చేస్తోందా అనుకుంటున్నారా? నో తమన్నా లుంగీ కట్టి తిరిగింది మరెక్కడో కాదు ఎయిర్పోర్టులో. అయితే ఇలా తిరగటం కూడా షూటిగ్ లో భాగంగా ఏం కాదు. అందుకే చాలా మంది తమన్నా మోకాళ్ళ దాకా ఎగ్గట్టిన లుంగీని చూసి కాస్త తికమక పడ్డారట. మోకాళ్ళ దాకా ఎగ్గట్టిన శంఖం మార్కు లాగా కనిపించేది తమన్నా కొత్త డ్రెస్స్ అని అర్థమయ్యి ముక్కున వేలేసుకున్నారు.

ఇంతకీ ఈ లుంగీ గోలేంటో ఒకసారి చూడండి. లుంగీ కట్టినా, లంగా వోణీలో అయినా తమన్నా మెరిసిపోతూనే ఉంటుంది. దనుకోంది.. ఇంతకీ ఇదే డ్రేస్స్ ఏపల్లెటూరి అమ్మాయో వేసి ఉంటే??? అందుకే అన్నారు జుట్టున్నమ్మ ఎన్నికొప్పులైనా వేస్తుందీ అని. హీరోయిన్ కాబట్టి లుంగీ, అయినా లంగా అయినా ఆహా..! ఓహూ..!! అనే అంటారు అభిమానులు.

 లాంగ్ షర్ట్ లాంటి టాప్

లాంగ్ షర్ట్ లాంటి టాప్

షూటింగ్ హడావుడిలతో సగం లైఫ్ ఫ్లైట్ లోనే గడిపేస్తుంటారు హీరోయిన్స్. వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్ట్స్ లో దర్శనమిస్తుంటారు. అలా కనిపించిన తమన్నా మోకాళ్ల పొడవున్న లాంగ్ షర్ట్ లాంటి టాప్ ఒకటి వేసుకొంది. చెక్స్ విత్ స్ట్రయిప్స్ మిక్సైన ఈ లాంగ్ టాప్ ని చూడ్డానికి అచ్చం లుంగీలా ఉంది. పైగా లుంగీని పైకెత్తి కట్టినట్టు తమన్నా కూడా ఆ డ్రెస్ ని మడతట్టేసింది.

.బ్లాక్ చెక్స్ ఉన్న లాంగ్ టాప్ :

.బ్లాక్ చెక్స్ ఉన్న లాంగ్ టాప్ :

డార్క్ గ్రే కలర్ మీద వైట్ లైన్స్.. బ్లాక్ చెక్స్ ఉన్న లాంగ్ టాప్ కి బ్లాక్ హ్యాండ్ బ్యాగ్.. బ్లాక్ హీల్స్ తో మ్యాచింగ్ మ్యాచింగ్ వేసి తమన్నా ఎయిర్ పోర్ట్ స్టైల్ ని సింపుల్ గా అదరగొట్టేసింది. అయితే వేసుకొన్న ఆ లుంగీ లాంటి టాప్ గురించి మాత్రం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఫ్యాషన్ కు ఏ పేరు పెట్టారోగానీ..

తమన్నానే చేసింది :

తమన్నానే చేసింది :

ఇప్పటికైతే తమన్నానే ఈ స్టైల్ ని పరిచయం చేసింది కాబట్టి అభిమానులు కొత్త పేరు ఏమైనా క్రియేట్ చేస్తారేమో చూడాలి. అయినా అంతందంగా అమ్మడు మెరిసిపోతూంటే వేరే పేరెందుకు... తమన్నా లుంగీ అంటే సరిపోతుంది కదా అప్పుడు మగాళ్ళకి కూడా ఇదే ఫ్యాషన్ డ్రెస్ అయిపోతుంది. ఇక ఈ మడత లుంగీ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ "క్వీన్" రీమేక్ లో తమన్నా కనిపించనుందనే వర్త ఇప్పుడు హాట్ టాపిక్కయ్యింది.

సూపర్ హిట్ :

సూపర్ హిట్ :

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన క్వీన్ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. క్వీన్ తో కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుని.. తన ఇమేజ్‌ను అమాంతం పెంచేసుకుంది. సూపర్ హిట్ ‘క్వీన్' మూవీ తమిళ్ రీమేక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది.

తమన్నా స్నేహితురాలి పాత్రలో:

తమన్నా స్నేహితురాలి పాత్రలో:

ఈ విషయాన్ని తమన్నా వెల్లడించింది. క్వీన్ రీమేక్‌లో నటించేందుకు సైన్ చేశా. ప్రస్తుతం డేట్స్ కోసం ఎదురుచూస్తున్నా. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది తమన్నా. ఈ మూవీలో తమన్నా స్నేహితురాలి పాత్రలో కోలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ కనిపిస్తుందట.

 అమాయకురాలికి :

అమాయకురాలికి :

ఇండియన్‌ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్‌ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు 'క్వీన్‌' సినిమాను. రేపు పెళ్లి అనగానే ఈ రోజు వరుడు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని వధువుకు చెబుతాడు. పెద్దగా లోకం తెలియని ఆ అమాయకురాలికి ఏం చేయాలో తోచదు. ఆ మాటతో తన కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌:

స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌:

అలాంటి స్థితిలో అంతకుముందు ప్లాన్‌ చేసుకున్న హనీమూన్‌ కు ఒక్కత్తే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా ప్యారిస్‌ బయల్దేరుతుంది. ఈ సింగిల్‌ హనీమూన్‌ ముగిసే సరికి తన ఆమె తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుందన్నది 'క్వీన్‌' కథ. స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ నిర్మించిన ఈ చిత్రానికి వికాస్‌ బాల్‌ అనే కొత్త డైరెక్టర్‌ దర్శకత్వం వహించాడు.

 తెలుగు భాషల్లో:

తెలుగు భాషల్లో:

'క్వీన్‌' సినిమాకు కంగనా నటనే ప్రధాన ఆకర్షణ. రాణి పాత్రలో ఆమె అదరగొట్టింది. పాత్రలో వేరియేషన్స్‌ ను అద్భుతంగా పండించింది. ఈ పాత్రకు ఆమె జాతీ య అవార్డు కూడా అందుకుంది. కంగన పాత్రలో మరొకరిని ఊహించు కోలేం అన్నట్లుగా నటించిందామె. ఇప్పుడీ పాత్రను తమిళ.. తెలుగు భాషల్లో తమన్నా చేయబోతోంది.

అభినేత్రి:

అభినేత్రి:

ముందు తమిళం వరకే తమన్నా అన్నారు కానీ.. తెలుగు వెర్షన్‌ కూడా ఆమెతోనే లాగిం చేస్తారట. మరి తమ్మూ ఆ పాత్రను ఎలా పోషిస్తుందన్నది ఆసక్తిక రం. బహుశా ఈ మధ్య వచ్చిన 'అభినేత్రి' చూశాక ఈ పాత్రకు తమన్నా సూటవు తుందని నిర్మాత త్యాగ రాజన్‌కు నమ్మ కం కుదిరిందేమో. అందులో సంప్ర దాయ బద్ధంగా కనిపించే పల్లెటూరి అమ్మాయిగా.. మోడర్న్‌గా కనిపించే సినీ నటిగా రెండు వేరియేషన్లున్న పాత్రలో అదరగొట్టేసింది తమ్మూ. తమ న్నా కెరీర్లో అది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ అని చెప్పొచ్చు.

English summary
Actress Tamannaah Bhatia will be starring in the Tamil remake of the National Award winning film ‘Queen’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu