»   » కరణ్ జోహార్ కి కూడా తమన్నానే కావాలట

కరణ్ జోహార్ కి కూడా తమన్నానే కావాలట

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయం సాధించిన 'ఊపిరి' చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఊపిరి మాతృక అయిన ఫ్రెంచ్ మూవీ "ఇన్‌టచబుల్స్" కాపీ రైట్స్‌ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడో కొనేశాడు.

అయితే అక్కడ కథ చర్చల్లో ఉండగానే మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాత్రం రీమేక్ రైట్స్ కొనేయడం, సినిమా తీసేయడం,హిట్ కొట్టేయడం కూడా అయిపోయింది.ఇక ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా ఊపిరి తీసుకోవటానికి రెడీ అయిపోయారు.
తెలుగులో నాగార్జున చేసిన బిలియనీర్ పాత్ర నీ బిగ్ బి అమితాబ్ చేయనున్నారట. ఇక కార్తి స్దానం లో వరుణ్ ధావన్ కనిపించనున్నాడు.అయితే నాగ్ పీఏ క్యారెక్టర్ కోసం మాత్రం తెలుగు లో చేసిన తమన్నానే ఎంచుకున్నారట.తమన్నాను మించి ఎవరూ చేయలేరని, తమ్మూనే కరెక్టని కరణ్ ఫిక్స్ అయ్యారు.

Tamanna Bhatia in the Hindi remake of Oopiri By Karan Johar

ఓ బిలియనీర్‌కి పిఎగా 'ఊపిరి' చిత్రంలో తమన్నా చాలా స్టయిలీష్‌గా కనిపించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న కీర్తి పాత్రను తమన్నా సమర్థవంతంగా పోషించింది. దీంతో ఆమెనే హిందీ రీమేక్‌లో తీసుకుంటే న్యాయం చేయగలదని కరణ్‌ భావిస్తున్నారట.
వస్త్రధారణ విషయంలోనూ, బాడీలాంగ్వెజ్‌లోనూ తమన్నా కనపరిచిన ప్రతిభను ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అందుకే మిగిలిన పాత్రధారుల మాటెలా ఉన్నా 'ఊపిరి' హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా తమన్నానే ఎంచుకోవడానికి నిర్మాత కరణ్‌జోహార్‌ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
Tamanna bags big Bollywood offer for Oopiri Remake
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X