»   » పైకి చెప్పటం లేదు గానీ తమన్నాకి గట్టి దెబ్బే... ఆ సినిమా ఆపేసారు

పైకి చెప్పటం లేదు గానీ తమన్నాకి గట్టి దెబ్బే... ఆ సినిమా ఆపేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

2014లో బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన 'క్వీన్' సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఆ రీమేక్ ఆగిపోయిందట.., భారీ అంచనాలతో అన్నీ సమకూర్చుకున్నాక ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే...

క్వీన్ రీమేక్ చేయడానికి

క్వీన్ రీమేక్ చేయడానికి

క్వీన్ సినిమాని తెలుగులో, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అప్పటి నుంచీ ఈ సినిమాలో కంగన పాత్ర రీ క్రియేట్ చేసే హీరోయిన్ కోసం అన్వేశించారు.... మొత్తానికి తమిళ, తెలుగు వెర్షన్ల‌కు తమన్నాను.. మలయాళానికి అమలా పాల్ ను.. కన్నడకు పారుల్ యాదవ్ ను కథానాయికలుగా కన్ఫమ్ అయ్యారు.

రేవతి దర్శకత్వం

రేవతి దర్శకత్వం

నటీనటులు ఇంకా ఫైనలైజ్ కాక ముందే ఈ సినిమాకి . అలనాటి స్టార్ హీరోయిన్ అయిన రేవతి క్వీన్ సినిమా తెలుగు, తమిళ భాషల రీమేక్ కి దర్శకత్వం వహించనుంది. అలాగే మరో స్టార్ హీరోయిన్ అయిన సుహాసిని మణిరత్నం ఈ సినిమాకి మాటల రచయితగా ఎంపిక అయ్యింది...

నాలుగు భాషల్లో

నాలుగు భాషల్లో

రీమేక్ రైట్స్ కొన్న త్యాగరాజన్ ముందు నాలుగు భాషలతోనూ పరిచయమున్న న‌టీన‌టుల‌తో సినిమా తీసి.. నాలుగు భాషల్లో రిలీజ్ చేయాల‌నుకున్నాడు. త‌ర్వాత ఆయ‌న ఆలోచ‌న మారింది. ఏ భాషకు ఆ భాషకు నటీనటుల్ని దర్శకుల్ని ఎంచుకునే పనిలో రెండేళ్లు గడిపేశారు.

సినిమాను ఆపేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి

సినిమాను ఆపేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి

ఈ మధ్యే తమిళ, తెలుగు వెర్షన్ల‌కు తమన్నాను.. మలయాళానికి అమలా పాల్ ను.. కన్నడకు పారుల్ యాదవ్ ను కథానాయికలుగా కన్ఫమ్ చేశాడు. ద‌ర్శ‌కుల్ని కూడా ప్ర‌క‌టించాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ.. ఆ సినిమాను ఆపేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. దాదాపు 99% ఆగిపోయినట్టే అని తెలిసింది

వివాహం ఆగిపోతే

వివాహం ఆగిపోతే

పెళ్లికి ముందు రోజున వివాహం ఆగిపోతే.. ముందుగా హనీమూన్ కోసం బుక్ చేసుకున్న టికెట్లపై వెకేషన్ కి వెళ్లిన అమ్మాయి కథే ఈ క్వీన్. పారిస్ టూర్ లో ఆమె ఎదుర్కున్న పరిస్థితులు తనలో వచ్చే మార్పు కొత్త పరిచయాలు ఆ తర్వాత పెళ్లి రద్దు చేసుకున్న వ్యక్తి వచ్చి సారీ అడగడం.. చివరకు క్షమించమని అడగడం హీరోయిన్ తిరస్కరించడం.. ఇదీ స్టోరీ లైన్.

ఏ భాషలో అయినా క్లిక్ అవుతుందనే

ఏ భాషలో అయినా క్లిక్ అవుతుందనే

ప్రధానంగా అభిమానం గల అమ్మాయిల కేరక్టర్ ని బేస్ చేసుకున్న స్టోరీ కావడంతో.. ఏ భాషలో అయినా క్లిక్ అవుతుందనే అంచనాలు ఉందటం తో ఈ సినిమాని రీమేక్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందట... ఈ విషయాన్ని రేమేక్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయిన తమన్నా నే దృవీకరించింది కూడా...

ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు

ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు

ఈ విషయాన్ని తమన్నా . 'అవును ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. అలాగని ఈ మూవీని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. అలాగని.. ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఎవరికీ తెలియదు' అని ఓపెన్ గానే చెప్పింది తమన్నా. ఈ మూవీని రేవతి దర్శకత్వంలో తెరకెక్కించాల్సి ఉంది.

మిల్కీ బ్యూటీ క్వీన్

మిల్కీ బ్యూటీ క్వీన్

తమిళ్-తెలుగు వెర్షన్లలో మిల్కీ బ్యూటీ క్వీన్ గా కనిపంచనుందనే ప్రచారం జరిగింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ తర్వాత.. తమ్మూకి కొత్త ఇమేజ్ వస్తుందని కూడా అంచనావేశారు.అయితే.. క్వీన్ ఆగిపోయినందుకు తానేమీ బాధ పడ్డం లేదని.. మరిన్ని ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తన చేతిలో ఉన్నాయని చెబుతోంది తమన్నా.

English summary
The Milky Beauty tamanna's the Tamil remake of Hindi blockbuster 'Queen' starring Kangana Ranaut is stpped.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu