For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీపురు పట్టిన తమన్నా...(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : హీరో రామ్ ఇచ్చిన ఛాలెంజ్ కు తమన్నా స్పందించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంది. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడాలో ఒక ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాలను అభిమానులతో కలసి శుభ్రం చేసిన అనంతరం సమంత, హన్సిక, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లకు రామ్ ఛాలెంజ్ విసిరారు. రామ్ సవాల్ ను స్వీకరించిన తమన్నా.. సోమవారం నాడు ముంబైలో లోఖండ్ వాలా రోడ్లను శుభ్రపరిచారు. చీపురు పట్టి రోడ్లను ఊడ్చడంతో పాటు చేత్తో చెత్తను ఎత్తారు. ఈ విషయమై రామ్ మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడు.

  సినిమాల విషయానికి వస్తే... తమిళ తెరపై మిల్కీ వైట్‌ బ్యూటీ తమన్నా మరోమారు తళుక్కుమని మెరవనున్నారంటూ తమిళ తంబిలు ఆనందపడుతున్నారు. గతంలో ఆర్యతో 'బాస్‌ ఎంగిరా భాస్కరన్‌' (నేనే అంబాని) వంటి హిట్‌ సినిమాలు తీసిన దర్శకుడు రాజేశ్‌.... మళ్లీ ఆర్య, సంతానం కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమాలో ఆర్య సరసన అందాల తమన్నా జోడీ కడుతున్నారు. ఇందులో ఆమెది చాలా కీలక పాత్రని సమాచారం.

  సోమవారం షూటింగ్ ప్రారంభించి ఈ నెల 21న చెన్నైలో రెగ్యులర్‌ షూటింగ్‌ నిర్వహించనున్నట్లు దర్శకుడు రాజేశ్‌ చెప్పారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని తెలిపారు. 'బాస్‌ ఎంగిరా భాస్కరన్‌'కు ఇది సీక్వెల్‌ అని వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది పూర్తి వైవిధ్య వినోదాత్మక చిత్రమన్నారు. దీంతో తమన్నా మళ్లీ తమిళ తెరపై జోరు పెంచనున్నారు.

  తెలుగు లో తమన్నా...

  రవితేజ సరసన తమన్నా ఆడిపాడబోతోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ గా తమన్నా ఎంపికయ్యిందంటూ వార్తలు వచ్చాయి. అదే నిజమేనంటూ ఆ విషయాన్ని తమన్నా ట్వీట్‌ చేసి అఫీషియల్ గా తెలిపింది. సినిమాలో మరో హీరోయిన్ కూ చోటుంది.

  తమన్నా ట్వీట్ చేస్తూ..."రచ్చ డైరక్టర్ సంపత్ నందితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషంగా ఉంది.. అలాగే రవితేజ తో మొదటి సారి నటించటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అందుకోసం ఎదురుచూస్తున్నా" అంది. ఇక సంపత్ నంది, రవితేజ దర్శకత్వంలో చిత్రం అని ప్రకటించగానే అంతా..కావాలని మీడియా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఇచ్చిన ప్రకటన అనుకున్నారు. కానీ తమన్నా ట్వీట్ తో ఆ ప్రాజెక్టు ఉన్నట్లే అని అర్దమవుతోంది.

  Tamanna Completed Hero's Challenge!!

  మిగతా చిత్రాల విషయానికి వస్తే...

  నాలుగేళ్లపాటు కోలీవుడ్‌లో హవా చాటిన మిల్కీ వైట్‌ బ్యూటీ.. తమన్నా ఆ మధ్య టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లతోపాటు పలువురు స్టార్ హీరోలందరితో జతకట్టింది. మళ్లీ ఇప్పుడు కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అయితే అది స్ట్రైయిట్ గా కాదు...తెలుగు,తమిళ చిత్రంతో అనితెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు కార్తి. ఈ చిత్రంలో నాగార్జున సైతం కనిపించనున్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.

  రీఎంట్రీలో ఏకంగా అజిత్‌తో జతకట్టి 'వీరం' వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ను అందించింది. ప్రస్తుతం సూర్య, విజయ్‌లతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వన్నెతగ్గని సోయగంతో.. దక్షిణాదిలో మోస్టు వాంటెడ్‌ హీరోయిన్‌గా హవా చాటుకుంటోంది తమన్నా ఇప్పుడు ఊహించని విధంగా కార్తితో మరోసారి ఈ ప్రాజెక్టులోకి వచ్చిందని సమాచారం.

  పూర్తి వివరాల్లోకి వెళితే....వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, తమిళ హీరో కార్తి కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. అయితే అధికారికంగా దర్శకనిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.

  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక గతంలో తెలుగులో నాగార్జున సరసన తమన్నా ఇప్పటివరకు నటించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదే తొలి సినిమా అవుతుందని నాగార్జున అభిమానులు ఆనందపడుతున్నారు.

  మరో ప్రక్క కార్తి,తమన్నాలు తమిళంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అవారా' , ‘సిరుత్తై' (విక్రమార్కుడు రీమేక్) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమన్నా ని తీసుకోవటం వల్ల తమిళంలో కూడా సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతుందని తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

  English summary
  Taking part in the 'Swachh Bharat' challenge posed by Ram, our milky siren took her time to clean a back road in the famous Lokhandwala locality in Mumbai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X