»   » బ్యాచిలర్ పార్టీలో తమన్నా రచ్చ

బ్యాచిలర్ పార్టీలో తమన్నా రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమన్నా బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ చేసింది. అయితే నిజ జీవితంలో కాదు...స్పీడున్నాడు చిత్రం కోసం. ఆ మధ్యన..నా ఇంటి పేరు సిల్కు... నా ఒంటి పేరు మిల్కు... అంటూ తమన్నా చేసిన పాటని కుర్రకారు ఇంకా మరిచిపోలేదు. తాజాగా మరో స్పెషల్ సాంగ్ లో ఆమె ఆడిపాడింది. బ్యాచిలర్‌ బాబుల పార్టీలోకి అడుగుపెట్టిన మిల్కీ తమన్నా ఎలా సందడి చేసిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు భీమనేని శ్రీనివాసరావు.

భీమినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పీడున్నోడు'. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించారు. సోనారిక హీరోయిన్. ఇందులో బ్యాచిలర్‌ బాబు... అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో తమన్నా ఆడిపాడింది. రూ: 2 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో తమన్నాపై పాటను తెరకెక్కించినట్టు చిత్రం యూనిట్ తెలియచేసింది.

చంద్రబోస్‌ రచించిన ఈ గీతానికి జానీ నృత్యరీతులు సమకూర్చారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘అల్లుడు శీను'లో తొలి స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా రెండో స్పెషల్ సాంగ్ ని కూడా ఆయన సినిమాలోనే చేయడం విశేషం. 2016 ఫిబ్రవరి 5వ తేదీన విడుదలకు ప్లాన్ చేసిన ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రస్తుతం హీరోయిన్ గా బిజీబిజీగా గడుపుతోంది. తమన్నా. ఇటీవలే ‘బెంగాల్‌ టైగర్‌'లో రవితేజ సరసన నటించి అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. ప్రస్తుతం నాగార్జున, కార్తీలతో కలసి ‘వూపిరి' చిత్రంలో నటిస్తోంది. ‘బాహుబలి'లో అవంతికగా మెప్పించింది తమన్నా ‘బాహుబలి 2'లోనూ ఆ పాత్రలో మెరవడానికి సిద్ధమవుతోంది.

English summary
In the upcoming film "Spedunnodu", milky beauty Tamanna is coming up with an item number. This song is set to be in a bachelors party of hero's friend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu