»   » 'హలో బ్రదర్‌' రీమేక్ లో హీరోయిన్స్ ఖరారు

'హలో బ్రదర్‌' రీమేక్ లో హీరోయిన్స్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య తన తండ్రి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'హలో బ్రదర్‌' రీమేక్ లో చేయటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎంపిక ముగిసింది. హన్సిక,తమన్నా ..వీళ్లిద్దరూ నాగచైతన్య సరసన నటించటానికి సైన్ చేసారు.


రమ్యకృష్ణ పోషించిన పాత్రకు తమన్నా, సౌందర్య స్థానానికి హన్సికనీ ఎంపిక చేసుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. నాగార్జున 'హలో బ్రదర్‌'లో పక్కా మసాలా పాత్రలో రమ్యకృష్ణనీ... అమాయక యువతిగా సౌందర్యనీ ప్రేక్షకులు మరచిపోరు. వాళ్లిద్దరి పాత్రలూ కావల్సినంత వినోదాన్ని పంచాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు.

నాగ్‌ నట వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ ముగిశాయి. తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. తమన్నాతో నాగచైతన్య నటించే మూడో చిత్రమవుతుంది కొత్త 'హలో బ్రదర్‌'. హన్సికతో తొలిసారి ఆడిపాడబోతున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నట్టు సమాచారం.

నాగార్జున కెరీర్లో చెప్పుకొదగ్గ హిట్ సినిమాల్లో 'హలో బ్రదర్' సినిమాది టాప్ ప్లేస్. నాగార్జున-ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో 1994లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపించింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ దేవాగా దొంగ పాత్రలో, రాక్ స్టార్‌గా రవి పాత్రలో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను అలరించాడు. నాగార్జున తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా కూడా ఇదే.

English summary
Nagarjuna, Ramya Krishna and Soundarya starrer Hello Brother (1994) is being remade with Naga Chaitanya as hero. Search for heroines for the remake of Hello Brother has come to an end. Tamannah has already been fixed for this film and now Hansika has signed on the dotted line. So Tamannah will be doing the role that was originally played by Ramya Krishna and Hansika will reprise Soundarya's character. Naga Chaitanya is stepping in his father's shoes in this remake as lead hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu