»   » ఆమెను చూస్తే తమన్నాను చూస్తున్నట్లే ఉంది, ఎవరామె?

ఆమెను చూస్తే తమన్నాను చూస్తున్నట్లే ఉంది, ఎవరామె?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మిల్కీ బ్యూటీ ప‌క్క‌న ఉన్న‌ది ఎవ‌రో తెలుసా? చూడ్డానికి ఆమె అచ్చం తమన్నాలాగానే ఉందికదూ... వాస్తవానికి ఆమె తమన్నా లా లేదు, తమన్నానే ఆమె పోలికల్లో జన్మించింది.

విషయం మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది. అవును ఆమె త‌మ‌న్నాకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి. ఇటీవ‌ల త‌మ‌న్నాకు వాళ్ల అమ్మ యంగ్ ఏజ్ లో ఉన్నపుడు దిగిన ఫోటో ఒకటి దొరికింది. వెంటనే దాన్ని అభిమానులతో పంచుకుంది.

నేను అచ్చు అమ్మ‌లాగే ఉన్నాను, ల‌వ్ యూ మామ్ అంటూ త‌మ‌న్నా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేంది.

Tamanna mother old pic

తమన్నా సినిమాల విషయానికొస్తే...... తమన్నా మెయిన్ రోల్ లో తెరకెక్కిన చిత్రం 'అభినేత్రి'. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందించారు. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌లో నిర్మిస్తున్నారు. హిందీలో సోనూ సూద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

English summary
"I am a reflection of her , an extension of her , love you mom", Tamanna tweeted her mother old pic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu