»   »  తమన్నాలో కొత్తగా ఏం కనిపిస్తుందో?

తమన్నాలో కొత్తగా ఏం కనిపిస్తుందో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ తెరకు తమన్నా కొత్తేం కాదు. అయితే హ్యాపీడేస్ సినిమాతోనే ఆమె కెరీర్ కు ఊపు వచ్చింది. హీరోయిన్ గా విజృంభిస్తోంది. ఒక సినిమా తరువాత మరో సినిమాలో బుక్ అయిపోతోంది. తాజాగా తెరంగేట్రం చేస్తున్న నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా రూపొందుతున్న దేవ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం పొందిన తమన్నా, మరికొద్ది రోజుల వ్యవధిలోనే మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ తమన్నా అవకాశాన్ని కొట్టేసింది. తాజాగా తమన్నా మరో అవకాశాన్ని కొట్టేసిందండోయ్. అల్లు అర్జున్ సరసన రూపొందనున్న మరో సినిమాలోనూ తమన్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇన్నాళ్లు కానరాని తమన్నాలో ఇపుడు కొత్తగా ఏం కనిపిస్తుందో అర్థం కావడంలేదు. దట్స్ నేచర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ.

Read more about: tamanna telugu cinema happy days
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X