»   » నాగచైతన్య, అల్లు అర్జున్ సరసన చేస్తున్న తమన్నా

నాగచైతన్య, అల్లు అర్జున్ సరసన చేస్తున్న తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యాపీ గర్ల్ తమన్నా తాజాగా నాగచైతన్య సరసన కమిటయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం బావా మరధళ్ళ చుట్టూ తిరిగే కథతో రూపొందనుందని తెలుస్తోంది. ఇక తమన్నా వివివినాయిక్ దర్శకత్వంలో రూపొందనున్న బద్రీనాధ్ చిత్రంలోనూ బుక్కయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న బద్రీనాధ్ కథని చిన్నికృష్ణ అందిస్తున్నారు. ఇక ఏ మాయ చేసావే తర్వత నాగచైతన్య డిమాండ్ ఉన్న స్టార్ గా మారారు. యువతరం ప్రేమ కథలకు అతన్ని ఎన్నుకుంటున్నారు. అలాగే అజయ్ భుయాన్ దర్శకత్వంలోనూ నాగచైతన్య చేస్తున్నారు. డి శివ ప్రసాద్ రెడ్డి నిర్మించే ఆ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక తమన్నా నటిస్తున్న తమిళ చిత్రం అవారా పేరుతో డబ్బింగే త్వరలో రిలీజ్ కానుంది. రన్, పందెం కోడి వంటి చిత్రాలు రూపొందించిన లింగు స్వామి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తూండటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu